విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన చేయాలంటూ దేశవ్యాప్త బంద్ సందర్భంగా శుక్రవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరి భా గాంధీ బాలికల విద్యాలయం, ఆదర్శ పాఠశాల, రేయిన్ బో ఇలీషు మీడియం ఉన్నత పాఠశాల, వెంకటసాయి ప్రాథమిక పాఠశాల స్వచ్ఛందంగా మూయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 20న ఢిల్లీలో లక్షలాది మంది విద్యార్థులు మార్చారు పార్లమెంట్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారు. దీంతో ఢిల్లీ పోలీసులు విద్యార్థి, యువతపై అత్యంత అమానుషంగా లాఠీఛార్జి , టియర్ గ్యాస్ ఉపయోగించి వేలాది మంది విద్యార్థులను గాయపర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించారు, విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తేవాలని, నీట్ పరీక్షా విధానాన్ని రద్దు చేసి రాష్ట్రాలు వారిగా వైద్య ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల నాయకులు హుస్సేన్ పటేల్, మేకడోణ గ్రామ కార్యదర్శి దీదార్ అహ్మద్, చిన్నతుంబళం గ్రామ అధ్యక్షులు, కార్యదర్శి కందనాతి లింగనాయుడు, శాంతిరాజు నిర్వహించారు.
పోస్ట్ బంద్ విజయవంతం మొదట కనిపించింది విశాలాంధ్ర.

