Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినా ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది.. ఆయన రాజీనామా చేస్తే బిజెపికి వచ్చిన లాభమేంటి.. ఇప్పుడు ఇవే చర్చలు జాతీయ స్థాయిలో నడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి నేషనల్ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఆ కథనాల ప్రకారం..
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక చాలా కథ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. భారత జనతా పార్టీతో దగ్గరగా ఉండే కొంతమంది వెనుక ఉన్న వ్యక్తులు కూడా ధర్మేంద్ర ప్రధాన రాజీనామా జరిగిన సంఘటనను బయటపెడుతున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం ఒత్తిడి తీసుకురావడం వల్లే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నట్టు తెలుస్తోంది. యువకులు చేస్తున్న ఉద్యమం తీవ్రతరం కావడంతోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ నిర్ణయం తీసుకుందని.. దానిని భారతీయ జనతా పార్టీ అమలు చేసిందని సమాచారం.
ఉత్తరప్రదేశ్.. పంజాబ్ రాష్ట్రాల్లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం భారతీయ జనతా పార్టీకి అత్యంత అవసరం. పైగా పంజాబ్ రాష్ట్రంలో చీకటి శక్తులు రాజ్యాన్ని ఏలుతున్నాయి. పైగా గతంలో రాష్ట్రంలో వెళ్లడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నప్పుడు.. అక్కడి చీకటి శక్తులు అడ్డుకున్నాయి. నడిరోడ్డు మీద నరేంద్ర మోడీ కాన్వాయ్ కలిగి ఆపేశాయి. అప్పటినుంచి పంజాబ్ మీద బిజెపి ఫోకస్ పెట్టింది. కాకపోతే గతంలో ఎన్నికల్లో అక్కడ ఆప్ గెలిచింది. నరేంద్ర మోడీ కాన్వాయ్ నడిరోడ్డు మీద ఆపినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది.
ఇప్పుడు పంజాబ్ మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. తాజాగా ఉద్యమాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే ఈ ఉద్యమాన్ని కాక్రోచ్ జనతా పార్టీ తమ విజయం కాకుండా.. విద్యార్థుల విజయం గా చెబుతోంది. ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పరిస్థితిని దాటకముందే ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలని.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం భావిస్తోంది. అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ అద్భుతమైన నాయకుడైనప్పటికీ.. ఎటువంటి అవినీతి మచ్చలేని ప్రజా ప్రతినిధి ఉన్నప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.

