సిద్దిపేట ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రైల్వే హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవ వేడుక రసాభాసగా మారింది. హాల్ట్ స్టేషన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జై పల్లా’ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి నచ్చచెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు శాంతించారు.
మరోవైపు, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్ కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. దర్శనం అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అందజేసి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
అనంతరం భక్తుల చిరకాల వాంఛ అయిన కొమురవెల్లి రైల్వే హాల్ట్ స్టేషన్ను నేతలు అధికారికంగా ప్రారంభించారు. హైదరాబాద్కు సుమారు 85 దూరంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న ఆలయానికి కొత్త రైల్వే స్టేషన్కు రావడం వల్ల… భక్తుల ప్రయాణం ఇకపై మరింత ఎక్కువగా మారనుంది.

