హైదరాబాద్: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆయన వ్యక్తిగత విషయం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థుల నిరసనలలో విదేశీ హస్తం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యువత, కాంగ్రెస్ నిరసనలతో కేంద్రం దిగివచ్చిందనేది నిజం కాదని, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంలో బిజెపి చిత్తశుద్ధిని చాటుకుందని రామచందర్ రావు తెలియజేశారు. పీజు రీయింబర్స్ మెంట్ చెల్లించని సిఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయించారు, రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసి చిత్తశుద్ధిని చాటు కోవాలని రామచందర్ రావు సూచించారు.

