వైసీపీ నేతలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి నెలకొంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు. వారి వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలతో నమోదవుతున్నవే అధికం. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ పై ఏకంగా సొంత కోడలు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఫ్యామిలీకి చిక్కులు తప్పేలా లేవు. మాజీ మంత్రి అప్పలరాజు కొడుకు మూలంగా ఇబ్బందులు తెచ్చుకున్నారు. కొడుకు తో పాటు అరెస్టయ్యారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం అరెస్టయ్యే అవకాశం ఉంది. అది కూడా కొడుకు మూలంగానే. ఎందుకంటే కుమారుడి పేరుతో.. ఆస్తి యజమాని బతికినే తప్పుడు ధృవీకరణ పత్రాలతో సమర్పించారు కాబట్టి.
సిదిరి అప్పలరాజు అలా..
కేవలం కుమారుల మూలంగానే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు పోలీస్ కేసులకు చిక్కారు. అరెస్టులు కూడా నడుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాలు అనేవి సహజం. అలానే రోడ్డు ప్రమాదానికి కారణం మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు. అయితే కుమారుడ్ని కేసు నుంచి తప్పించేందుకు మరొకరిని బలిపశువు చేశారు అప్పలరాజు. అలా కుమారుడ్ని బయటపడేస్తే ఇద్దరు దొరికిపోయారు. ప్రస్తుతం ఇద్దరూ ఒకే జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే పెద్దమనిషి పాత్ర పోషించి సమస్య పరిష్కరిస్తే బాగుండేది. కానీ దానిని రాజకీయ కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.
తమ్మినేని ఇలా..
మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా అలానే తన కొడుకుపై కేసు పెట్టారు. తన కుమారుడికి అడ్డగోలుగా నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పగించేందుకు.. ఏకంగా బతికున్న యజమానిని చనిపోయినట్టు చూపించి.. వారి వారసుల పేరుతో తప్పుడు ధృవీకరణ పత్రాలను రూపొందించి.. కుమారుడి పేరుతో జత చేయించారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు, ఒక పెద్ద మనిషిగా చలామణిలో ఉన్నప్పుడు ఇటువంటి అడ్డగోలు వ్యవహారానికి తెర తీశారు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఫ్యామిలీతో పాటు పరారీ అయ్యారు.
ఇప్పుడు జోగి రమేష్ వంతు..
ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. ఈయన కూడా కుమారుడి వల్ల కేసుల్లో చిక్కుకున్నారు. ఆయన ఒక్కరే కాదు ఫ్యామిలీ మొత్తం 11 మందిపై ఇప్పుడు సొంత కోడలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయింది. వరకట్నం తో పాటు గృహహింస చేస్తున్నారంటూ సొంత కోడలు ఫిర్యాదు చేయడం మాత్రం సంచలనంగా మారింది. ఏడాది కిందట కుమారుడికి వివాహం జరిగింది. ఇంతలోనే ఈ వివాదం తలెత్తింది. పరిష్కరించాల్సిన పెద్దమనిషి పాత్రలో నిర్లక్ష్యం చేయడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. ఇది కూడా రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు జోగి రమేష్. ఇలా వైసిపి నేతలకు కుమారుల వల్ల తలవొంపులు వస్తుండడం మాత్రం నిజంగా ఆందోళన కలిగించే విషయమే.

