-ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పరిటాల సునీతకు గ్రామస్థుల కృతజ్ఞతలు
విశాలాంధ్ర- రాప్తాడు : 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాప్తాడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే పరిటాల సునీత నిలబెట్టుకున్నారని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రాప్తాడులోని ప్రసిద్ధ శ్రీ పండమేటి వెంకటరమణ స్వామి దేవాలయ అభివృద్ధి పనుల కోసం రెండో విడత కింద రూ. 2.86 కోట్ల నిధులు ఇవ్వడం పట్ల గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే సునీత సోదరుడు, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళికి ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల కోరికను సానుకూలంగా స్వీకరించి, నిధులను అందించడానికి శ్రమించిన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మరాప్తాడు గ్రామస్థుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా నిధులు అందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడమే కాకుండా, శ్రీ పండమేటి వెంకటరమణ స్వామివారి ఆశీస్సులతో రాప్తాడు గ్రామం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

