మొదట నటుడిగా పరిచయం అయిన వెంకీ అట్లూరి.. తర్వాత దర్శకుడిగా మారుతుంటే తనలో ఈ టాలెంట్ కూడా ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. నటన నుంచి దర్శకత్వంలోకి అడుగుపెట్టిన వాళ్ల మీద మరీ ఎక్కువ అంచనాలేమీ ఉండవు. కానీ వెంకీ మాత్రం తాను యాక్సిడెంటల్ యాక్టర్ అని, బేసిగ్గా మంచి రైటర్ కమ్ డైరెక్టర్ అని తొలి చిత్రం ‘తొలి ప్రేమ’తోనే రుజువు చేశాడు.
తర్వాతి రెండు చిత్రాలు మిస్టర్ మజ్ను, రంగ్ దే నిరాశపరిచినా.. ఆపై సార్, లక్కీ భాస్కర్ చిత్రాలతో గొప్ప పేరే సంపాదించాడు. దర్శకుడిగా ఒక గౌరవం సంపాదించాడు. ఇప్పుడు సూర్య లాంటి పెద్ద హీరోతో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ చేశాడు వెంకీ. ఐతే సూర్యతో సినిమా అనేసరికి చాలా జాగ్రత్త పడ్డానని.. స్క్రిప్టు విషయంలో తన కెరీర్లో మరే చిత్రానికీ చేయనంత కసరత్తు చేశానని అంటున్నాడు వెంకీ.
తాను అత్యంత సుదీర్ఘ కాలం రాసిన స్క్రిప్టునన్న వెంకీ.. వివిధ వెర్షన్లతో ఏకంగా తొమ్మిది డ్రాఫ్టులు రెడీ చేసినట్లు తెలిపాడు. ఫైనల్‌గా ఒక వెర్షన్ ఓకే చేశాక కూడా క్లైమాక్స్ విషయంలో మళ్లీ తర్జన భర్జనలు జరిగినట్లు తెలిపాడు. మూడు క్లైమాక్సులు రాసి.. సూర్య ముందు పెట్టానని, అందులోంచి ది బెస్ట్‌ను ఆయన ఓకే చేశారు, క్లైమాక్స్ ఆయన ఛాయిసే అని తెలిపాడు వెంకీ. సూర్య సరసన మామిత బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ 14వ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
ఇక తన తర్వాత సినిమా గురించి చెబుతూ.. ‘సార్’ తర్వాత మళ్లీ ధనుష్‌తో ఒక సినిమా చేయాలనుకుంటున్నాను.. ఆ స్క్రిప్టు రెడీ అయి, సినిమా పట్టాలెక్కేందుకు రెండేళ్లు పట్టొచ్చని వెంకీ అన్నాడు. ఇది పోలీస్ కథ అని, దాని లైన్ ధనుష్ ఓకే చేశాడని, కానీ అతను బేసిగ్గా రైటర్ కమ్ కాబట్టి.. ఆయన్ని మెప్పించేలా కథ తయారు చేయాలంటే డైరెక్టర్ టైం పడుతుందని వెంకీ అన్నాడు.

