రామాయణం ట్రైలర్: బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని , సుమారుగా 4000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ‘రామాయణ్’ ని రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే విడుదలైన టీజర్ కి సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ సరిగా లేవని, 4000 కోట్ల బడ్జెట్ పెట్టమని (…)
రామాయణం ట్రైలర్: బాలీవుడ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని , సుమారుగా 4000 కోట్ల రూపాయల బడ్జెట్ తో ‘రామాయణ్’ ని రెండు భాగాలుగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే విడుదలైన టీజర్ కి సోషల్ మీడియాలో నెటిజెన్స్ నుండి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ సరిగా లేవని, 4000 కోట్ల బడ్జెట్ పెట్టమని డప్పు కొట్టుకున్నారు , కానీ కనీసం సీరియల్స్ రేంజ్ క్వాలిటీ తో కూడా తియ్యలేదని , ఇలా ఎన్నో రకాల కామెంట్స్ వినిపించాయి. నెటిజెన్స్ నుండి వచ్చిన ఈ ఫీడ్ బ్యాక్ ని మూవీ టీం చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే గ్రాఫిక్స్ పై మరోసారి రీవర్క్ చేసి , నేడు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేసింది.
వాస్తవానికి ఈ సినిమా ట్రైలర్ ని జులై 20 న మీడియా ప్రతినిధులకు ప్రదర్శించి చూపించారు. జులై 24 న ఈ ట్రైలర్ ని సోషల్ మీడియా లో విడుదల చేద్దామని భావించారు. కానీ సోనీ పిక్చర్స్ సంస్థ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు ముందుకు రావడంతో , వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేశారు. నేడు తెల్లవారు జామున విడుదలైన ఈ థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. గ్రాఫిక్స్ ఈసారి అదిరిపోయిందని , క్వాలిటీ కూడా చాలా బాగుందని , రావణుడిగా యాష్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడని , రాముడిగా రణబీర్ కపూర్ కూడా అద్భుతంగా తెరపై కనిపిస్తున్నాడని , ఆడియన్స్ కి ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందని అర్ధం అవుతోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే కొన్ని నెలల క్రితం విడుదల చేసిన టీజర్ లో కానీ , నేడు విడుదల చేసిన ట్రైలర్ లో హనుమంతుడి క్యారెక్టర్ ని చూపించకపోవడం పై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించారు. హనుమంతుడు లేనిదే రామాయణం లేదు, ఆయన్ని కోట్లాది మంది హిందువులు అమితంగా పూజిస్తారు , అయితే ఆయన్ని సూపర్ హీరో గా పిల్లలు భావిస్తున్నారు. అలాంటి హనుమంతుడికి సంబంధించిన షాట్స్ కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అందరినీ బాధిస్తోంది. చివరికి శూర్పనక్క క్యారెక్టర్ ని కూడా చూపించారు కానీ , హనుమంతుడి ని మాత్రం ఎందుకు దాచిపెట్టారు అంటూ సోషల్ మీడియా లో మేకర్స్ ని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. అయితే హనుమంతుడిని ట్రైలర్ లో చూపించకపోవడానికి గల ముఖ్య కారణం, ఆయన పాత్రకు సంబంధించిన VFX వర్క్ పూర్తి కాకపోవడం వల్లనే అట. ఇప్పుడు ఆయన షాట్స్ ని పెట్టలేరు కానీ , రిలీజ్ ట్రైలర్ లో మాత్రం కచ్చితంగా పెడతారని అంటున్నారు.

