బుచ్చిబాబు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ వచ్చే నెల 4న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది మూవీ టీం. అందులో భాగంగా డైరెక్టర్ బుచ్చి బాబు రీసెంట్ గా వరుసపెట్టి ఇంటర్వ్యూ ఇవ్వడం మొదలు పెట్టాడు. ఈ ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి బుచ్చి బాబు చెప్పిన మాటలు వింటే , ఇంత స్థాయికి ఎదిగిన వాళ్ళు , ఇంత డౌన్ టు ఎర్త్ ఉంటారా అని అనిపించక తప్పదు. కొద్దిగా ఫేమ్ రాగానే అతి చేసే సెలబ్రిటీలు , బుచ్చి బాబు రెహమాన్ గురించి చెప్పిన ఈ మాటలు వింటే మారతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆయన ఇంటికి ‘పెద్ది మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం రెహమాన్ గారి వెళ్ళాము. ఆయన మా కోసం ఇప్పటికే మూడు ట్యూన్స్ రెడీ చేసి ఉంచాడు. వాటిలో మొదటి ట్యూన్ వినగానే నచ్చలేదు సార్ అని చెప్పాను, అవునా , అయితే రెండవ ట్యూన్ విను అన్నాడు , అది కూడా బాగాలేదు అని చెప్పాను , పోనీ మూడవ ట్యూన్ వినగానే అన్నాడు , అది కూడా నచ్చలేదు అని మొహమాటం లేకుండా చెప్పాను. అవునా, సరే ఇలా కూర్చో , కొత్తది చేద్దాం అనేవారు. నాకు అలా లేదు అని ముఖం మీదనే చెప్పడం కరెక్ట్ కాదు అనే విషయం నాకు తెలియదు , నా పక్కన ఉన్న నలుగురు అలా మాట్లాడకూడదు అని చెప్తే, అబ్బా చాలా పెద్ద తప్పు చేశానే అని అనుకున్నాను. ఆ తర్వాత రెహమాన్ గారికి క్షమాపణలు చెప్పడానికి వెళ్తే, నువ్వు వెయ్యి సార్లు రిజెక్ట్ చేసిన నేను ఏమి అనుకోను, మీరు సంతృప్తి చెందడమే నాకు కావాలి అన్నాడు’ అంటూ బుచ్చి బాబు చెప్పుకొచ్చాడు.
కేవలం ఒక్కటంటే ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ బుచ్చి బాబు. అలాంటి డైరెక్టర్ , ఆస్కార్ విజేత అందించిన మ్యూజిక్ ని రిజెక్ట్ చేసినప్పటికీ, చిరాకు పడకుండా, అతను పూర్తిగా సంతృప్తి చెందేంత వరకు ట్యూన్స్ ఇస్తూనే ఉన్నాడంటే , రెహమాన్ గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి మ్యూజిక్ డైరెక్టర్ లో కొంతమందికి టాలెంట్ కూడా యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది , వారి కెరీర్ కేవలం కొంత కాలం వరకు పరిమితం అవుతుంది , రెహమాన్ లాంటోళ్ళు దశాబ్దాల తరబడి ఇప్పటికీ టాప్ సినిమాలకు సంగీతం అందించడానికి కారణం , వారి ప్రవర్తన, ఓపిక , సహనం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి ఉంటుంది.

