Hindu Faith: తమిళనాడు రాజకీయాల్లో ‘సనాతన ధర్మం’ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత ఉదయనిధి “సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి” అంటూ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ (కామెంటేటర్, లెగ్ స్పిన్నర్) లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఉదయనిధి స్టాలిన్ మరోసారి అన్నారు
“సనాతనాన్ని నిర్మూలించాలి.”
అసెంబ్లీలో సీఎం జోసెఫ్ విజయ్ ఇప్పుడే చూస్తూ ముకుళిత హస్తాలతో పలకరించారు pic.twitter.com/MNMz7PWmQL
— మేఘ్ నవీకరణలు 🚨™ (@MeghUpdates) మే 12, 2026
అదే తప్పు చేస్తే.. మీరే కనుమరుగవుతారు!:
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా శివరామకృష్ణన్ ఘాటైన పోస్ట్ చేశారు. “మోటారుకు కొన్ని పార్టీలు మార్చి, కొత్త వాహనాలు వేసి యువతను మభ్యపెట్టి అధికారంలో ఉన్నాయి.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యక్తి డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయాడు (ఎన్నికలని కనుగొని)
పాత మోటారు కొన్ని భాగాలను మార్చింది మరియు కొత్త కోటు పెయింట్ చిన్న పిల్లలను అధికారంలో కూర్చోబెట్టడానికి మోసగించింది, అయితే సనాతన ధర్మాన్ని నిర్మూలించే ఒక డిప్యూటీ సీఎం నిష్క్రమణను చూసింది. దయచేసి అదే తప్పు చేయకండి, మీరు త్వరలో నిర్మూలించబడతారు. మేము హిందువులు సనాతన ధర్మాన్ని అంతిమంగా నమ్ముతాము
— లక్ష్మణ్ శివరామకృష్ణన్ (@LaxmanSivarama1) మే 17, 2026
ఓపిక నశిస్తే.. తీవ్ర పరిణామాలే:
మాజీ కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ మరొక పోస్ట్‌లో మాకు శాంతియుతంగా, ఎంతో ఓపికగా ఉండాలని నేర్పిస్తారు.. ఆ ఓపిక అనేది సాగే రబ్బరు బ్యాండ్ లాంటిది.. ఒక హద్దు వరకు సాగుతుంది, కానీ మితిమీరి లాగితే అది తెగిపోయి గందరగోళ పరిస్థితులకు దారి తీస్తుంది. ఎవరి నమ్మకాలు వాళ్లు ప్రశాంతంగా కలిసి జీవించవచ్చు అని తెలియజేసారు.
సాధారణంగా మనం శాంతియుతంగా ఉండాలని మరియు అధిక స్థాయి సహనాన్ని కలిగి ఉండాలని బోధించబడతాము, ఇది సాగేది, ఒక నిర్దిష్ట పరిమితి వరకు సాగుతుంది, కానీ చాలా ఎక్కువ సాగుతుంది, అది విరిగిపోతుంది మరియు గందరగోళం ఏర్పడవచ్చు. మనమందరం వారి విశ్వాసాలతో శాంతియుతంగా కలిసి జీవించగలం. దయతో
— లక్ష్మణ్ శివరామకృష్ణన్ (@LaxmanSivarama1) మే 17, 2026
కలిసికట్టుగా ఉందాం.. జై శ్రీరామ్:
తన పోస్ట్‌ల తర్వాత హిందువులను ఎగతాళి చేస్తూ తనకు రిప్లైలు వస్తున్నాయని మాజీ కామెంటేటర్ శివరామకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మనమంతా ఏకతాటిపైకి రావాలి. ఒకే ఒక్క వెదురు బొంగును సులభంగా విరిచేయొచ్చు.. అదే ఓ పెద్ద కట్టగా ఉంటే విరగ్గొట్టడం ఎవరి తరం కాదు.. భగవంతుడు మన వైపే ఉన్నాడు.. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అంటూ సనాతన ధర్మ అనుచరులంతా ఐక్యంగా ఉండాలని కోరాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. భావప్రకటన స్వేచ్ఛ, సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న ఈ జాతీయ స్థాయి పొలిటికల్ డిబేట్లో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నేను ఇప్పటికే హిందువులను అపహాస్యం చేస్తూ సమాధానాలు పొందడం ప్రారంభించాను. మనమందరం కలిసి ఉంటూ, మన ధర్మం కట్టుదిట్టంగా ఉండేలా చూసుకుందాం. ఒకే వెదురును విరగగొట్టడం సులభం, కానీ ఒక పెద్ద గుత్తిని పగలగొట్టడం కష్టం. జై శ్రీ రామ్. భారత్ మాతా జీ జై. దేవుడు మన పక్షాన ఉన్నాడు 🙏🙏🙏
— లక్ష్మణ్ శివరామకృష్ణన్ (@LaxmanSivarama1) మే 17, 2026

