గుడ్లు తినేటప్పుడు జరిగే పొరపాట్లు: ప్రపంచంలో అత్యంత పోషకమైన ఆహారాల్లో గుడ్లు ఒకటిగా గుర్తింపు పొందాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు సమృద్ధిగా ఉండటం వలన వీటిని ‘సూపర్ ఫుడ్’గా పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ గుడ్లు మంచి పోషణను అందిస్తాయి. అయితే గుడ్లు తినేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తారు. ఇవి ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఆ తప్పులు ఏవీ? గుడ్లు ఎవరు తినొద్దు?
గుడ్డులోని పచ్చసొనను గుడ్ కొందరు పూర్తిగా పక్కన పెట్టేస్తారు. పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువ అనే భయంతో కేవలం తెల్లటి పదార్థాన్ని మాత్రమే తింటారు. కానీ పచ్చసొనలోనే విటమిన్ ఎ, డి, ఇ, కె, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, కొలిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా మెదడు ఆరోగ్యం, హార్మోన్ల పనితీరు, కంటి చూపు కోసం పచ్చసొన ఎంతో ఉపయోగపడుతుంది. అందువల్ల పూర్తిగా దాన్ని మానేయడం వల్ల శరీరానికి అవసరమైన కొన్ని పోషకాలు తగ్గిపోతాయి.
గుడ్లను అతిగా తినడం వల్ల ప్రోటీన్ ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశంతో రోజుకు 6 నుంచి 10 వరకు గుడ్లు తింటారు. అయితే అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో కొవ్వు, కాలరీలు అధికమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్, డయాబెటిస్ ఉన్నవారు పరిమితంగా మాత్రమే గుడ్లు తీసుకోవాలి. ఏ ఆహారం అయినా పూర్తిగా తీసుకుంటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుంది.
తెల్లసొన Vs పచ్చసొన:
గుడ్డు తెల్లసొనలో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కొవ్వు తక్కువగా ఉండటంతో జిమ్ చేసే వారు, బాడీ బిల్డర్లు తెల్లసొనను తీసుకుంటారు. ఇది కండరాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. తక్కువ కాలరీలు ఉన్నవారికి బరువు తగ్గడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది.
పచ్చసొనలో మాత్రం విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు అధికంగా ఉంటాయి. కంటి ఆరోగ్యానికి ఉపయోగపడే ల్యూటిన్, జియాక్సాంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. మెదడు పనితీరుకు అవసరమైన కొలిన్ కూడా పచ్చసొనలోనే లభిస్తుంది. అందువల్ల తెల్లసొన – పచ్చసొన పూర్తి వాటిని కలిపి తినడం వల్లే పోషకాలు అందని నిపుణులు చెబుతున్నారు.
కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు గుడ్లను మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు పూర్తిగా చెబుతున్నారు. అయితే వారానికి ఎన్ని గుడ్లు తినాలి అనేది వైద్యుల సలహాతో నిర్ణయించుకోవడం మంచిది. ముఖ్యంగా వేయించిన గుడ్ల కంటే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్లతో పాటు సమతుల ఆహారం, వ్యాయామం కూడా తప్పనిసరి.
గుడ్లు పూర్తి పోషకాల భాండాగారం. అయితే పచ్చసొనను పూర్తిగా మానేయడం లేదా అతిగా గుడ్లు తినడం సరైన పద్ధతులు కావు. సరైన మోతాదులో, సమతుల ఆహారంతో కలిపి గుడ్లు తీసుకుంటే శరీరానికి పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

