RR vs LSG: ఐపీఎల్ 2026 (IPL 2026)లో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్లేఆఫ్స్ రేసులో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన హై-వోల్టేజ్ చేజింగ్‌లో రాజస్థాన్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ టార్గెట్‌ను రాయల్స్ బ్యాటర్లు ఊచకోత కోస్తూ చేజ్ చేశారు. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో స్టేడియాన్ని షేక్ చేశాడు.
జైస్వాల్ మెరుపులు:
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ కలిసి పవర్‌ప్లేలో సూపర్ ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరి మధ్య మొదటి వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ముఖ్యంగా కెప్టెన్ యశస్వి జైస్వాల్ ఆరంభం నుంచే లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న తరుణంలో జైస్వాల్ (23 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు) ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
వైభవ్ విధ్వంసం:
జైస్వాల్ అవుట్ అయిన తర్వాత వైభవ్ సూర్యవంశీ తన విశ్వరూపం చూపించాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేసిన ఆకాశ్ సింగ్‌ను వైభవ్ టార్గెట్ చేశాడు. ఆ ఓవర్లో 6, 6, 4, 4, 4 బాదడంతో పాటు లక్నో బౌలర్ రెండు వైడ్లు వేయడంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 26 పరుగులు వచ్చాయి. లక్నో బౌలర్లను వణికిస్తూ కేవలం 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 93 పరుగులు చేసి సెంచరీకి చేరువైన వైభవ్‌ను దిగ్వేష్ రాఠీ అవుట్ చేశాడు. సెంచరీ మిస్ అయినా వైభవ్ ఆడిన ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.
మయాంక్ యాదవ్ ఓవర్లో 29 పరుగులు:
ఎక్స్‌ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ వేసిన ఓ ఓవర్లో ధ్రువ్ జురెల్, వైభవ్ సూర్యవంశీ కలిసి 4, 6, 6, 1, 6, 6తో ఏకంగా 29 పరుగులు చేశారు. ఈ ఊచకోతతో మ్యాచ్ పూర్తిగా రాజస్థాన్ వైపు తిరిగింది. ధ్రువ్ జురెల్ మెరుపు హాఫ్ సెంచరీతో రాయల్స్‌కు విజయాన్ని అందించాడు.
లక్నో బౌలర్ల వైఫల్యం:
లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్ 3 ఓవర్లలోనే 54 పరుగులు సమర్పించుకోగా, మయాంక్ యాదవ్ కూడా భారీగా పరుగులు ఇచ్చాడు. అంతకముందు లక్నో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి మిచెల్ మార్ష్ (96), జోష్ ఇలీస్ (60) రాణించడంతో 5 వికెట్లకు 220 పరుగులు చేసినప్పటికీ.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ల ధాటికి లక్నోకు ఓటమి తప్పలేదు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ రేసులో మరింత ముందడుగు వేసింది.
జైపూర్‌లో ఆనందం మరియు ఆనందం 🩷🥳
నుండి ఒక ప్రకటన వేట @రాజస్థాన్ రాయల్స్ వారు తిరిగి 🔝4️⃣ 👏లోకి దూకడం చూస్తుంది
స్కోర్‌కార్డ్ ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #ఖేల్ బిందాస్ | #RRvLSG pic.twitter.com/7lJD2IYOUF— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 19, 2026
𝗦𝘁𝗼𝗿𝗺 𝗼𝗳 𝗦𝗶𝘅𝗲𝘀 🚀
వైభవ్ సూర్యవంశీ వెలిగిపోయాడు #RRఉరుములతో కూడిన 93(38) 🎇తో ఛేజ్
నవీకరణలు ▶️ https://t.co/LvQzM3tl06 #TATAIPL | #ఖేల్ బిందాస్ | #RRvLSG | @రాజస్థాన్ రాయల్స్ pic.twitter.com/qe6TfmGnTx— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 19, 2026
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల తుఫాన్.. లక్నోపై 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

