తెలంగాణ:సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ (హుజూర్నగర్)పట్టణంలో రోడ్డుపై జారిపడి ఉన్న కంకరను గమనించిన వెంటనే వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు.రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులకు ప్రమాదం కలగకుండా పట్టణ బీట్ కానిస్టేబుళ్లు నాగ రమేష్,గురవయ్య సమయస్ఫూర్తితో చర్యలు తీసుకోవడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ చర్యతో రాత్రివేళ ప్రయాణిస్తున్న వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.టిప్పర్ల అధిక లోడింగ్ కారణంగా కంకర రోడ్డుపై పడిపోవడంతో ప్రమాదాలకు అవకాశం ఏర్పడిందని స్థానికులు తెలిపారు.
ఓవర్లో వాహనాలపై అధికారులు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

