Adarsha Kutumbam: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న అగ్ర దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. రైటర్ గా కెరియర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మారి చాలా తక్కువ సమయంలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. తన మాటల్లో ఉండే పదును ప్రతి ఒక్క ప్రేక్షకుడి గుండెల్లో గుచ్చుకుంటుంది. అందుకే ఆయన మాటల మాంత్రికుడు అనే పేరు కూడా సంపాదించుకున్నాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని చాలా హిలేరియాస్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన చాలా సినిమాల్లో ట్రైన్ ఎపిసోడ్ సీక్వెన్స్ లు చాలానే వచ్చాయి.కానీ శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పాలి. దాదాపు 40 నిమిషాల పాటు ఇక్కడ సినిమా మొత్తం నడుస్తుంది. ఓవరాల్ కామెడీ మొత్తం ఆ ట్రైన్ ఎపిసోడ్ లోనే ఉంటుంది. అలాగే సినిమా మలుపు కూడా అక్కడే తిరుగుతుంది. ఇక దాన్ని బీట్ చేసే విధంగా చాలా సినిమాల్లో ట్రైన్ జర్నీలో కామెడీ రాసినప్పటికి వెంకీ మూవీ కామెడీ ట్రాక్ ను బ్రేక్ చేయలేకపోయింది. కానీ గురూజీ మాత్రం ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చూస్తున్నాడు. వెంకీ తో చేస్తున్న ఆదర్శ కుటుంబం సినిమాలో ఒక 25 నిమిషాల పాటు సాగే ట్రైన్ ఎపిసోడ్ ఉందట…
ఆ సీక్వెన్స్ మొత్తం హిలేరియస్ కామెడీతో ఉంటుందనే వార్తలైతే వస్తున్నాయి. ఇక దానికి తోడుగా ఆయన ఇంతకుముందు ఎలాగైతే తన మాటల్లోని పదునుతో కామెడీని జనరేట్ చేశాడో ఇప్పుడు దానికి భిన్నంగా సిచువేషనల్ కామెడీని చేయడానికి ఆయన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది.
కారణం ఏంటంటే ఆయన మాటల్లో ఉండే పదును వల్ల వచ్చే కామెడీ కంటే సిచువేషనల్ గా వచ్చే కామెడీ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుందని ప్రతి ఒక్కరు దానికి కట్టుబడి ఉంటారని ఆయన భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆయన దాన్ని ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
గత సినిమాల కంటే కూడా ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా చాలా గట్టిగానే ఉంటుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

