రామ్ చరణ్ పై అఖిల్ ఎమోషనల్ పోస్ట్ నిన్న మొన్నటి వరకు రామ్ చరణ్ అభిమానులు ‘పెద్ది’ చిత్రంలో తమ అభిమాన హీరో అంత అద్భుతంగా నటిస్తే , ఒక్క స్టార్ హీరో కానీ , డైరెక్టర్ కానీ ఆయన్ని మెచ్చుకుంటూ పోస్టులు వెయ్యలేదని, రామ్ చరణ్ అంటే కుళ్ళిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో విచారం వ్యక్తం చేశారు. కానీ నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పెద్ది’ చిత్రం గురించి అద్భుతంగా నమోదైంది , రామ్ చరణ్ పై పొగడ్తల వర్షం కురిపించడంతో అభిమానులు చాలా సంతోషించారు. ఇప్పుడు లేటెస్ట్ గా అక్కినేని నాగ చైతన్య కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాసేపటి క్రితమే ఆయన ‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘మై డియర్ బ్రదర్ రామ్ చరణ్.. నీ కష్టం , డెడికేషన్ తో పెద్ది మొత్తం నడిపించావు. నీ అద్భుతమైన నటన గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు సరిపోవడం లేదు. ప్రతీ క్రాఫ్ట్ లోనూ నువ్వు చూపించిన డెడికేషన్ కి సెల్యూట్ చేస్తున్నాను. పెద్ది చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అంతే కాకుండా ఈ చిత్రం లో నటించిన నటీనటులకు , టెక్నీషియన్స్ కి కూడా శుభాకాంక్షలు. మీరు పడిన కష్టం ప్రతీ ఫ్రేమ్‌లోనూ కనిపించింది. మీ కష్టంతో ఇలాంటి క్వాలిటీ కంటెంట్ సినిమాని అందించి , మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు ధన్యవాదాలు’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ , అఖిల్ సొంత అన్నదమ్ములు లాగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. వీళ్లిద్దరి మధ్య బ్యాండింగ్ అనేక సందర్భాల్లో బయటపడింది.
రామ్ చరణ్ పెద్ది సినిమా తన ‘లెనిన్’ కోసం నిర్మాతలతో మాట్లాడి వాయిదా వేయించాడు అఖిల్. ఆ స్థాయి అనుబంధం వీళ్లిద్దరి మధ్య ఉంది. టాలీవుడ్ లో దిగ్గజ స్టార్ హీరోలకు వారసులుగా ఎంట్రీ ఇచ్చి , ఏ ఈగో లేకుండా సాగుతున్న వీళ్లిద్దరి రిలేషన్ ని చూసి సోషల్ మీడియాలో అభిమానులు మురిసిపోతున్నారు. లేకపోతే ‘లెనిన్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. లెనిన్ ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అఖిల్ కెరీర్ లోనే ఈ చిత్రం ది బెస్ట్ గా నిలిచిపోతుందని అంటున్నారు, చూడాలి మరి అది ఎంత వరకు నిజం అనేది.
నా ప్రియమైన సోదరుడు RC.
మీ కృషి, అంకితభావం సినిమాని పూర్తి స్థాయిలో నడిపించాయి. చాలా లేయర్లు మరియు పరివర్తనలతో ఎంత నమ్మశక్యం కాని పనితీరు. మీ క్రాఫ్ట్ పట్ల మీకున్న అంకితభావం మరియు దానికి అప్రయత్నంగా వ్యవహరించినందుకు నేను మీకు నమస్కరిస్తున్నాను.
పెద్ది టీమ్ మొత్తానికి అభినందనలు…
— అఖిల్ అక్కినేని (@AkhilAkkineni8) జూన్ 10, 2026

