- ఏపీలో వారం పాటూ భానుడి భగభగలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
AP Weather : ఏపీలో భిన్న వాతావరణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలతో ఒకవైపు ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. అయితే, నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు లేదంటే జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు కాస్త ఉపశమనానికి గురిచేస్తున్నా.. వచ్చేవారం రోజులు మాత్రం ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: వైభవ్ సూర్యవంశీ : వైభవ్ సూర్యవంశీ సరికొత్త రికార్డు.. తొలి భారతీయుడిగా గుర్తింపు.. టార్గెట్ గేల్
ఏపీలో మరోవారం పాటు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు ప్రాంతాల్లో ఏకంగా 45డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ (సోమవారం) పలు జిల్లాల్లో ఎండలు, వేడిగాలులు తీవ్ర పెరగనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస, బూర్జ, హిర, కంచిలి, నందిగం, పాతపట్నం, సోంపేట, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, బొండపల్లి, దత్తిరాజేరు, గంట్వాడ, మొరకముడిదాం, రామభద్రాపురం, సంతకవిటి, తెర్లాం, వంగర, పార్వతీపురం, మన్యంలక్ష్మీ జిల్లా బలిబియ్య జిమ్మాపురం కొమరాడ, కురుపాం, పాచిపెంట, పాలకొండ, సాలూరు, సీతంపేట, వీరఘట్టం మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది. అదేసమయంలో మరో 21 మండలాల్లో వేడిగాలులు ప్రభావం చూపుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రసారం చేసింది. ఇక మంగళవారం 84 మండలాల్లో తీవ్ర వేడిగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఏపీలో ఎండలతోపాటు వర్షాలుసైతం దంచికొట్టనున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, పిడుగులతో కూడిన జిల్లాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. అలాగే, గంటకు 40 నుంచి 50 వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

