Bandla Ganesh Controversy: రీ రిలీజ్ చిత్రాల విషయం లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేయడం లో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ దిట్ట అంటూ సోషల్ మీడియా లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. రీసెంట్ గానే బండ్ల గణేష్ ఈ నెల 26న పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ ఈ వార్త పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇన్ స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో ఈ చిత్రం మొదలైన సన్నివేశాలను షేర్ చేయడం జరిగింది. ఎక్కడ ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వీడియోలు కనిపిస్తున్నాయి. ఇలా అభిమానులు జూన్ 26 న థియేటర్స్ లో సంబరాలు రెడీ అవుతుండగా, కాసేపటి క్రితమే బండ్ల గణేష్ అభిమానుల గుండెలు బద్దలయ్యే వార్త చెప్పాడు.
ఆయన మాట్లాడుతూ ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం అపూర్వమైన స్పందనతో ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండడంతో , ఈ నెల 26న రీ రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను. థియేటర్స్ లో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘పెద్ది’ సినిమా కలెక్షన్స్ పై ఎలాంటి ప్రభావం పడకూడదు అంటే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను , గబ్బర్ సింగ్ రీ రిలీజ్ కి సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే ప్రారంభిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దీనికి ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇస్తూ ‘నిన్ను ఇప్పుడు గబ్బర్ సింగ్ రీ రిలీజ్ చేయమని అడగలేదు , కానీ ఏ విడుదల చేస్తానని మీరే ఆశపెట్టారు , ఇప్పుడు ఆ ఆశలపై నీళ్లు జల్లుతున్నారు, ఇదెక్కడి న్యాయం’ అంటూ పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
బండ్ల గణేష్ కి ఇదేమి కొత్త కాదు. 2021 వ సంవత్సరం లో ఆయన ‘గబ్బర్ సింగ్’ సెప్టెంబర్ 2 న 100 కి పైగా స్పెషల్ షోలు విడుదల చేస్తానని ప్రకటించారు. కానీ కట్ చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 20 షోలు కూడా పడలేదు. అదే విధంగా ఆయన నిర్మాణంలో తెరకెక్కిన ‘తీన్ మార్’ కూడా భారీ రేంజ్ లో రిలీజ్ చేస్తానని మాట ఇచ్చాడు. ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు , ఇప్పుడు లేటెస్ట్ గా ‘గబ్బర్ సింగ్’ కి కూడా అదే చేశాడు. ఇలా ఎన్ని సార్లు ఫ్యాన్స్ ని నమ్మించి మోసం చేస్తావు , ఈసారి నువ్వు నిజంగా రీ రిలీజ్ చేస్తానని చెప్పినా ఎవ్వరూ నమ్మరు అంటూ పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించారు #పెద్ది సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ ఎంచుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #గబ్బర్ సింగ్ సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.
థియేటర్లలో ఇంకా…
– బండ్ల గణేష్. (@గణేష్బండ్ల) జూన్ 18, 2026

