బిగ్ బాస్ 10 తెలుగు పోటీదారుల జాబితా: టాలీవుడ్ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ షోలో కంటెస్టెంట్స్ ఎవరు అంటే దానిపై అప్పుడే హైప్ క్రియేట్ అవుతోంది. లేటెస్ట్ ప్రోమోలో ‘దశావతారం’ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సీజన్ మరింత సవాళ్లతో ఉండనుందని చెప్పకనే చెప్పారు. ‘ఆటలో సవాల్ కాదు… ఈసారి ఆటే సవాల్’ అనే క్యాప్షన్‌తో నాగ్ బిగ్ హైప్ క్రియేట్ చేశారు.
కంటెస్టెంట్స్ వీరేనా?
సోషల్ మీడియాలో సీజన్ 10 కంటెస్టెంట్స్ జాబితా వైరల్ అవుతోంది. టీవీ సీరియల్ యాక్టర్స్ పల్లవి గౌడ, తేజస్విని గౌడ, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, రాకింగ్ రాకేష్, ఆట సందీప్ వైఫ్ జ్యోతి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ నందు, యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ రాయల్ రమణ, శివ్, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రైటర్ కడలి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. సంబంధిత అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
అగ్ని పరీక్ష ఉంటుందా?
బిగ్ బాస్ సీజన్ 9లో తొలిసారిగా అగ్నిపరీక్ష ద్వారా సామాన్యులు ఎంట్రీ ఇచ్చారు. టైటిల్ విన్నర్ కూడా కామనరే. తమ టాలెంట్, మైండ్ గేమ్‌తో సెలబ్రిటీలకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన కామనర్స్ ఏకంగా టైటిల్‌నే సాధించారు. బిగ్ బాస్ 9 విన్నర్‌గా పడాల కల్యాణ్ నిలిచాడు. మరి ఈసారి కూడా కామనర్స్‌కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.
ఈ దశావతారం సీజన్లో చాలా వరకు కామనర్స్‌కు కూడా ఛాన్స్ ఇస్తారని ఫిలింనగర్ వర్గాల టాక్. ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ను త్వరలోనే ప్రారంభిస్తారని… శివాజీ, గీతా మాధురి, రాహుల్ సిప్లిగంజ్ సహా పలువురు మాజీ కంటెస్టెంట్స్‌ను ఈ ఎంపికకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
ఎప్పుడు ప్రారంభం?
ఒకవేళ అగ్నిపరీక్ష సీజన్ 2 అన్నీ పూర్తైన తర్వాత… సరికొత్తగా ఆగస్ట్ లాస్ట్ వీక్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోంది లేదా. ఈ ఫార్మాట్లో కొత్త అంశాలు యాడ్ చేస్తారని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : ఆశు రెడ్డి: అషు రెడ్డి ఈజ్ బ్యాక్… బోల్డ్ ఫోటోలతో ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ
పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న ధర్మేంద్ర | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు

