రంగారెడ్డి జిల్లా: ఆరుగురిని హత్య చేసిన నిందితుడు రాజ్ కుమార్ సెల్ఫీ వీడియో బయటపడింది. తనను ఆ బాలిక మోసం చేసిందని వీడియోలో చేర్చాడు. తనను ఆ కుటుంబం మొత్తం వాడుకుని వదిలేసిందని కూడా వీడియోలో చెప్పాడు. తాను అన్ని రకాలుగా అప్పులు పాలయ్యానని చెప్పారు. ఆరుగురిని హత్య చేసే ముందు ఈ సెల్ఫీ వీడియో రాజ్ కుమార్ రికార్డు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
జీవితం మీద విరక్తి పుట్టిందని కూడా రాజ్ కముర్ చెప్పాడు. రాజ్ కుమార్ మొబైల్ లో సెల్ఫీ వీడియోను పోలీసులు చూపించారు. రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని రాత్రి 10.30 గంటలకు గ్రామంలోకి వచ్చాడని, అక్కడి నుంచి బాలికను తీసుకుని దేవర కొండకు రాజ్ కుమార్ వచ్చాడని పోలీసు కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు మేనమామ ఊరికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. పోలీసులు ఆధారాలను సేకరిస్తున్న సమయంలో ఈ వీడియో బయటపడిందని చెప్పారు.

