తెలంగాణ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. అయితే బీఆర్ఎస్ లో ఇప్పటి వరకూ చేరికలు లేవు. సహజంగా పార్టీపై వ్యతిరేకతతో కొందరు అధికార ప్రతిపక్ష పార్టీలో చేరడం ప్రారంభిస్తారు. కాంగ్రెస్ తర్వాత బలమైన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే ఆ పార్టీలో చేరేందుకు ఇంత వరకూ ఏ నేత ముందుకు రాకపోవడం ఒకరకంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకు అద్దం పడుతుంది. బీఆర్ఎస్ లో చేరడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందన్న అనుమానాలు ఉండబట్టే గులాబీ కండువా కప్పుకోవడానికి పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బీఆర్ఎస్ పార్టీ ఇంటి పార్టీగా మారింది. కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులే పెత్తనం చేస్తున్నారు. దీంతోపాటు జిల్లాకొక నాయకుడు కనుసన్నల్లో పార్టీ ఉంది. ఆ జిల్లాలో నేతలు చేరాలంటే ముందుగా ఆ జిల్లా నేతలను సంప్రదించాలి. ఒక్కో జిల్లాకు ఒక్కో నాయకుడు బీఆర్ఎస్లో మోనార్క్‌గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో మంత్రులుగా కేసీఆర్ కేబినెట్లో పనిచేసిన వారు జిల్లా పార్టీపై పెత్తనం చేస్తామంటూ తమకు ఇష్టమైన వారినే పార్టీలో చేర్చుకునేందుకు సుముఖత చూపుతున్నారన్న విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. నేరుగా కేటీఆర్, హరీశ్ రావును కలసి పార్టీలో చేరినా జిల్లాలో పెత్తనం నాయకుడికి ఆగ్రహం కలిగితే వారికి టిక్కెట్ దక్కదన్న అభద్రతాభావంలో ఉన్నారు.
నేరుగా కొంతమంది ను కలసి పార్టీలో చేరినా వారిని రాజకీయాలకు దూరంగా ఉంచుతుండటం ప్రదర్శనలో జిల్లాగా చూపుతున్నారు. కేసీఆర్ ను నేరుగా కలిసే ఛాన్స్ ఎటూ లేదు. కేటీఆర్, హరీశ్ రావులను కలసి లైన్ క్లియర్ చేసుకున్నా చేరికపై జిల్లా నేతలనే సంప్రదింపులు జరుపుతున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు బీజేపీ మేలన్న అభిప్రాయంలో ఉన్నారు. బీజేపీ క్రమంగా తెలంగాణలో పుంజుకుంటు నేరుగా బీజేపీలో చేరితే తమ రాజకీయ జీవితం నల్లేరు మీద నడకలా సాగుతుందని విశ్వసిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ లో గత రెండేళ్ల నుంచి పెద్దగా చేరికలు లేకపోవడానికి కారణమని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం ఈ లోపాలపై దృష్టి సారించాలని కిందిస్థాయి క్యాడర్ కోరుకుంటోంది.

