మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు పెద్దమందడి ద్వారా పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి మనిగిళ్లలో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం,ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీల వైఫల్యం వల్ల రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు నీటి పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ వెంటనే ధాన్యం కొనుగోలు చేసి వారంలోపల రైతుల ఖాతాలో డబ్బులు వేశారని అన్నారు. నేడు రేవంత్ పాలనలో రైతులు ధాన్యాన్ని అమ్మడానికి నెలలుగా వేచి చూడాల్సివస్తుందని దుయ్యబట్టారు. రైతుల ఊసూరు తాకి ప్రభుత్వం ఆగం కాక తప్పదు.ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, ఇది ప్రభుత్వ చేతగానితనం,నిర్లక్ష్యమే కాక రైతులపై ఉద్దేశపూర్వకంగా యూరియా ఇవ్వకుండా, కరెంట్ సరఫరాలో లోపం కొనుగోలులో జాప్యం చేయడం వల్ల రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం వల్ల దళారులకు అమ్ముకొని ప్రభుత్వంపై భారం పడకుండా నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి కుట్ర చేస్తున్నారు.

