చిరంజీవి: గత 50 సంవత్సరాల నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని ఆనందాన్ని అందజేస్తున్న వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. ఇప్పటివరకు ఆయన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇక రాజకీయ రంగ ప్రవేశం చేసిన చిరంజీవి అక్కడ ఇమడలేక మళ్ళీ ఇండస్ట్రీ కి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు. అప్పట్నుంచి ఇప్పటివరకు భారీ సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మధ్యలో కొన్ని విజయాలు తన ఖాతాలో పడినప్పటికి అవి చిరంజీవి రేంజ్ సక్సెస్ లు కావని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు భారీగా వర్కౌట్ కావడం లేదు. దాంతో ఎలాగైనా మరోసారి భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేశాడు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి చిరంజీవి రేంజ్ ను చూపించే సినిమాలైతే పడడం లేదు… ఇక ఇప్పుడు మరోసారి బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి ఈ సినిమాతో ఎలాగైనా సరే తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేసాడు… ఇక గతంలో చిరంజీవి ఒక ఇద్దరు దర్శకులతో సినిమాలను చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ అనుకోని కారణాలవల్ల సినిమా అయితే పట్టాలెక్కలేదు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాగా, మరొకరు శేఖర్ కమ్ముల కావడం విశేషం…
అయితే వీళ్ళిద్దరి డైరెక్షన్ లో తను సినిమా చేయడానికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. కానీ అనుకొని కారణాల వల్ల రెండు సినిమాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. సెకండ్ ఇన్నింగ్స్లో శేఖర్ కమ్ముల చిరంజీవితో ఎలాంటి సబ్జెక్ట్ చేస్తుంది అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వెలువడ్డాయి. నిజానికి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఒక మాస్ కమర్షియల్ సినిమా షేర్ కమ్ముల రాశారట.
ఆయన డైరెక్షన్ లో మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన సినిమా వస్తే ఎలా ఉంటుందనేది చూడడానికి చాలామంది ఆసక్తి చూపించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం గత మూడు సంవత్సరాల క్రితం చిరంజీవితో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు.
కానీ చిరంజీవికి ఉన్న కమిట్మెంట్స్ అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పే సాఫ్ట్ కథ చిరంజీవికి పెద్దగా ఎక్కకపోవడం వల్లే ఆ కథని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఇక మీదట త్రివిక్రమ్ శ్రీనివాస్, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో గాని నటించే అవకాశం వస్తే మాత్రం మిస్ చేసుకోనని తప్పకుండా వాళ్లతో సినిమా చేస్తానని గతంలో పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పడం విశేషం…

