Chiranjeevi Market Range: మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో పెను సంచలనాలను క్రియేట్ చేయడంలో కొంతవరకు వెనుకబడిపోతున్నాడు. కారణం ఏంటి అంటే ఆయనకు ఈజీ పెరిగే కొద్ది డిఫరెంట్ సినిమాలను చేయలేకపోతున్నాడని కొందరు అంటుంటే చిరంజీవి మాత్రం ఏజ్ తో సంబంధం లేదు. తను ఎలాంటి పాత్రనైనా సరే పోషించాను కానీ తన వద్దకు వచ్చిన స్క్రిప్ట్ లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నానని డిఫరెంట్ సినిమాలను దర్శకుడు తన దగ్గరికి వస్తే తప్పకుండా అలాంటి సినిమాలు చేస్తానని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక నిజానికి చిరంజీవి సినిమాలకు ఓవర్ బడ్జెట్ పెట్టడం కంటే చాలా తక్కువ బడ్జెట్ పెడితేనే బెటర్… ఎందుకంటే ఇప్పుడు ఆయన మార్కెట్ 400 కోట్ల వరకు మాత్రమే ఉంది. అందుకే ఆయన సినిమా మీద 150 నుంచి 200 కోట్ల వరకు పెడితే దర్శక నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉండొచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన ‘మనశంకర్ వరప్రసాద్’ సినిమా 400 కోట్లకు పైనే కలెక్షన్స్ ను రాబట్టింది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని చిరంజీవి మార్కెట్ ఎంత ఉందంటే అంచనాకైతే వస్తున్నారు. చిరంజీవి గత 50 ఏళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్నాడు.
కాబట్టి ఆయన నుంచి వచ్చే సినిమాల విషయంలో ప్రేక్షకులు కూడా చాలా వరకు కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక మార్కెట్ తో సంబంధం లేకుండా ఇప్పటికైనా చిరంజీవి రియాలెస్టిక్ గా ఉండే సినిమాలు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ ఆయన అడపదడప అలాంటి సినిమాలు చేసిన ప్రేక్షకులు వాటిని ఆదరించడం లేదు.
కమర్షియల్ సినిమాల వైపు ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఆయన అలాంటి సినిమాలను మాత్రమే చేస్తున్నాడు… ఇక ప్రస్తుతం ఆయన బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా కూడా కమర్షియల్ సినిమానే కావడం విశేషం…ఈ మూవీకి దాదాపు 200 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చిరంజీవి ఒక ఇప్పటికైనా తన పంథా ను మార్చుకొని డిఫరెంట్ సినిమాలు చేస్తే చూడాలని ఒక వర్గం ప్రేక్షకులైతే. ఇక ఫ్యూచర్ లో అది వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి…

