ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ గత నెల రోజుల నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తుంది. ఈ ఉద్యమం దేశం మొత్తం విస్తరిస్తుంది. పాట్నా, ముంబయి వంటి నగరాల్లోనూ యువత బయటకు వస్తున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేస్తేనే తాము ఆందోళనను విరమిస్తామని కాక్రోచ్ జనతా పార్టీ చెబుతుంది. కానీ ఆ ఒక్కటీ అడక్కండి.. అన్ని రకాలుగా ఇక చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో ఈ సమస్యకు ఎప్పుడు తెరపడుతుందన్నది దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదు. పైకి గంభీరంగా ఉన్నా లోపల మాత్రం అలజడిని ఎదుర్కొంటోంది. రెండు పక్షాలు చర్చకు సిద్ధమంటున్నాయి. కానీ స్థలం ఎక్కడో తేలడం లేదు.
నీట్ ప్రశ్నపత్రం లో లీకేజీ జరిగింది వాస్తవం. తప్పు జరిగింది. దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయవలసింది కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నీతులు చెప్పే వారు నైతికతను కూడా పాటించాలని కోరుతుంది. మరొకరు మంత్రిగా ఆ స్థానంలోకి వస్తే ఏ ప్రశ్నపత్రం లీకు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, అందుకే తమ డిమాండ్ అని సీజేపీ చెబుతోంది. దేశ వ్యాప్త ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు రేపు వచ్చింది. దేశ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కోరింది. శాంతియుతంగా తమ నిరసనలు తెలియజేయాలని కోరింది. రేపు ఇప్పటికే విద్యాసంస్థల బంద్ కు అనేక రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాలు పిలుపు నిచ్చాయి.
మరొకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా తన పట్టును వీడటం లేదు. ఉద్యమానికి తలొగ్గితే మరొక ఉద్యమం పుట్టుకొస్తుందేమోనన్న భయం ప్రభుత్వంలో సహజంగా ఉండవచ్చు. అందుకే ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్ కు అంగీకరించడం లేదు. మరొకవైపు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేశారు. నాలుగు రాష్ట్రాల్లో ఐదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించారు. దోషులను వదిలి పెట్టే ప్రసక్తి లేదని అంటున్నారు. ఇటువంటి కేంద్ర ప్రభుత్వం దిగి రావడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ తగ్గడం లేదు. మరి ఈ సమస్యకు, ఆందోళనలకు ముగింపు ఎన్నడన్నది మాత్రం తెలియడం లేదు. దేశ వ్యాప్తంగా మాత్రం యువతకు అండగా నిలిచేందుకు మాత్రం వెనుకాడటం లేదు. చిట్ట చివరకు దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందనేది తేలకుండా ఉంది.

