తెలంగాణ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలకు కొదవలేదు. అంశంపై మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఏదో వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు, మంత్రి కొండా సురేఖకు మధ్య గత కొంతకాలంగా అనేక సార్లు వివాదాలు తలెత్తాయి. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఈ అంశంపై విచారించింది. కొద్దిరోజులు సద్దుమణిగినట్లు అనిపించేలా ఏదో ఒక వివాదంపై మంత్రి కొండా సురేఖ నెత్తికెత్తుకుంటున్నారు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను రచ్చ చేసి వీధికెక్కుతున్నారు. దీంతో ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారుతుంది. పార్టీ అభిమానుల్లో ఈ ఘటనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
తాజాగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారని, ఇది పరిపాలన నిబంధనలను ఆరోపిస్తూ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. తాను అధికారులతో ఎలాంటి సమీక్ష నిర్వహించలేదని, తన నియోజకవర్గంలోని ఆలయాల సమస్యల పరిష్కారం కోసమే దేవదాయ శాఖ కమిషనర్‌ను కలిశానని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ అవగాహన లోపంతో, కేవలం వివాదాలు సృష్టించేందుకే తనపై నిరాధార ఆరోపణల కౌంటర్ ఇచ్చారు.ఈ వివాదం ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే ఈ వివాదం ఫుల్ స్టాప్ పడిపోయిందని కొండా సురేఖ చెబుతున్నప్పటికీ కడియం శ్రీహరి ఘాటు కౌంటర్ ఇచ్చారు. ప్రజల మధ్య తిరగని నేతలు ఇలా ఏదో ఒక వివాదాన్ని తెచ్చి తాము వార్తల్లో ఉందామని అనుకుంటారని కొండా సురేఖను ఉద్దేశించి సూచించారు. తాను తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు, ఆలయాల అభివృద్ధి గురించి మాత్రమే చర్చించానని, ఉమ్మడి వరంగల్ జిల్లా దేవాలయాల గురించి కూడా చర్చించలేదని ఆయన చెప్పారు. అయితే నిన్న రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాసిన లేఖలో కడియం శ్రీహరిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టడమే ఇందులో ట్విస్ట్. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేత. ఆయన పై ఇటీవల స్పీకర్ సయితం బీఆర్ఎస్ లోనే ఉన్నారని ప్రకటించారు. మరి కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు ఎలా తీసుకుంటుందన్నది వేయి ప్రతిపాదన ప్రశ్న. అందుకే పార్టీ పరిష్కరించాల్సిన సమస్యలు బయటకు పొక్కితే ఇలాగే ఉంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
.

