స్లైస్ UPI క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు: ప్రస్తుత క్రెడిట్ కార్డుల వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే చాలా మంది క్రెడిట్ కార్డు తీసుకోవడానికి వెనుకాడే ప్రధాన కారణం వార్షిక ఫీజులు, జైనింగ్ ఛార్జీలు, ఇతర ఫెనాల్టీలు. ఇలాంటి స్లిక్ UPI క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. ఈ కార్డు జీవితకాలం ఉచితంగా అందుబాటులో ఉండటంతో పాటు రోజువారీ UPI చెల్లింపులకు ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే?
UPIతో సులభ చెల్లింపులు:
స్లైస్ సూపర్ కార్డు ఒక RuPay ఆధారిత UPI క్రెడిట్ కార్డు. దీన్ని Google Pay, PhonePe, Paytm వంటి UPI యాప్‌లతో లింక్ చేసుకుని QR కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు. చిన్న మొత్తాల లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల కొనుగోళ్ల వరకు సులభంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనితో నగదు లేదా డెబిట్ కార్డు లేకుండా రోజువారీ ఖర్చులను క్రెడిట్ ద్వారా నిర్వహించవచ్చు.
ఈ కార్డు ప్రత్యేకతల్లో ముఖ్యమైనది ఎలాంటి జైనింగ్ ఫీజు, వార్షిక రుసుము లేదా మెయింటెనెన్స్ ఛార్జీలు లేకపోవడం. అందువల్ల అదనపు ఖర్చుల భయం లేకుండా దీర్ఘకాలం వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డులతో ఇది వినియోగదారులకు ఆర్థికంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. స్లైస్ కార్డుతో చేసిన లావాదేవీలపై క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. కంపెనీ ప్రకారం.. వినియోగదారులు కొన్ని షరతులు నెరవేర్చితే 3 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం ఉంది. అయితే సాధారణంగా ప్రాథమిక స్థాయిలో 1 శాతం రివార్డులు లభిస్తాయి. ఎక్కువ రివార్డుల కోసం నిర్దిష్ట ఖర్చులు లేదా సేవింగ్స్ బ్యాలెన్స్‌కు సంబంధించిన అర్హతలు ఉండొచ్చు.
రూ.2,000 పైబడిన చెల్లింపులకు ‘నో కాస్ట్ ఈఐఐ’:
ఈ కార్డులో మరో ముఖ్యమైన ఫీచర్ ‘స్లైస్ ఇన్ 3’. సాధారణంగా రూ.2,000 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలను జరిపితే.. మూడు నెలల నోకాస్ట్ EMIగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయంపై అదనపు వడ్డీ లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండవని కంపెనీ నమోదవుతోంది. పెద్ద మొత్తం ఖర్చులను ఒకేసారి చెల్లించాల్సిన అవసరం ఉండదు. దేశీయ UPI చెల్లింపులతో పాటు ఈ కార్డును అంతర్జాతీయంగా కూడా ఉపయోగించవచ్చు. 200కు పైగా దేశాల్లో కార్డు ఆమోదం పొందుతుందని సంస్థ. తరచుగా విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఇది అదనపు ప్రయోజనకరంగా మారుతుంది.
ఈ కార్డు పొందాలంటే:
స్లైస్ UPI క్రెడిట్ కార్డ్ పొందాలనుకునేవారు స్లైస్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. KYC ప్రక్రియ తర్వాత అర్హత ఆధారంగా క్రెడిట్ లిమిట్ చేస్తారు. అనుమతి వచ్చిన వెంటనే వర్చువల్ కార్డు లభించగా, తర్వాత ఫిజికల్ కార్డును కూడా అందజేస్తారు.

