Dragon Glimpse Update: ఈ నెల 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా , ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ‘డ్రాగన్’ మూవీ కి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. పుట్టినరోజు మొదలైన వెంటనే అర్థ రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ మాస్ విశ్వరూపాన్ని ఇండియా మొత్తం షేక్ అవ్వబోతుంది. నిన్న ట్విట్టర్ లో మేకర్స్ ‘APOCALYPSE’ అని వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. ఈ అర్థం ట్వీట్ మే 20 న ప్రపంచం అంతం అయిపోబోతుంది అని. అంటే ఎన్టీఆర్ ని అంత పవర్ ఫుల్ గా మీరంతా చూడబోతున్నారు అంటూ చెప్పకనే చెప్పేసారు మేకర్స్. ఈ గ్లింప్స్ నిడివి దాదాపుగా 4 నిమిషాల 35 సెకన్లు ఉంటుందట. ఒక గ్లింప్స్ వీడియో ఇంత లెంగ్త్ తో ఉండటం హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు.
ఎడారి లో చేస్తున్న సన్నివేశాలతో పాటు , కొన్ని యాక్షన్ బ్లాక్స్, డైలాగ్స్ ఇవన్నీ ఈ పవర్ గ్లింప్స్ వీడియో లో ఉంటాయట. మరో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే , ఈ చిత్రంలో హీరో ఎన్టీఆర్ యే , విలన్ కూడా ఎన్టీఆర్ యే , డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. ఈ రెండు క్యారెక్టర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా గ్లింప్స్ వీడియోలో చూపించబోతున్నట్టు చూపించారు. ఎన్టీఆర్ కి డ్యూయల్ రోల్స్ వేయడం కాదు , ‘జై లవ కుశ’ లో ఏకంగా ట్రిపుల్ రోల్ చేశాడు , అందులో ఒక క్యారెక్టర్ నెగెటివ్ అయ్యాడు, చివర్లో ఆ క్యారెక్టర్ ని పాజిటివ్ చేసి జనాల్లో సానుభూతి వచ్చేలా చేశాడు. కానీ ‘డ్రాగన్’ లో అలాంటివి ఏమి లేవట , జాలి, దయ , కరుణ లేని మానవమృగం లాగా కనిపించబోతున్నాడట ఎన్టీఆర్.
ఈ రెండు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ నట విశ్వరూపం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రశాంత్ నీల్ కరెక్ట్ గా మ్యానేజ్ బాక్స్ చేస్తే , ఈ చిత్రం ఇండియన్ ఆఫీస్ వద్ద అద్భుతాలను నెలకొల్పుతుంది అనడం లో డైరెక్టర్ ఎలాంటి సందేహం లేదు. రవి బస్రూర్ సంగీతం అందజేస్తుంది ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది.

