eSIM | ఈసీమ్ వాడితే ఇంటర్నెట్ వేగంగా పెరుగుతుందా? సంప్రదాయ ఫిజికల్ సిమ్ కంటే మెరుగ్గా పనిచేస్తుందా? అని చాలామంది ఆలోచిస్తున్నారు. మరి ఈసిం వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్లలో ఇప్పుడు eSIM టెక్నాలజీ విస్తరిస్తోంది. ఒకప్పుడు ఐఫోన్లతో పాటు ప్రీమియం ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు మీడియం రేంజ్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీనితో చాలామంది ఈసిమ్ వాడటంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈసీమ్ వాడితే ఇంటర్నెట్ వేగంగా పెరుగుతుందా? సంప్రదాయ ఫిజికల్ సిమ్ కంటే మెరుగ్గా పనిచేస్తుందా? అని చాలామంది ఆలోచిస్తున్నారు. మరి ఈసిం వల్ల ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
eSIM అంటే ఏంటి?
eSIM అంటే ఎంబెడెడ్ సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఇది సాధారణ సిమ్ కార్డు తరహాలో తీసి పెట్టుకునేది కాదు. మొబైల్ ఫోన్ తయారీ సమయంలోనే ఫోన్ మదర్ బోర్డులో అమర్చిన డిజిటల్ సిమ్. కాబట్టి ప్రత్యేకంగా సిమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. టెలికాం సంస్థల నుంచి అందే డిజిటల్ ప్రొఫైల్‌ను ద్వారా నెట్వర్క్ సేవలను వినియోగించుకోవచ్చు.
eSIM వల్ల ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
ఈసీమ్ వాడుతున్నంత మాత్రాన ఇంటర్నెట్ వేగం పెరగదు. ఇంటర్నెట్ స్పీడ్ అనేది ప్రధానంగా నెట్వర్క్ కవరేజ్, టెలికాం ఆపరేటర్ సేవలు, 4జీ లేదా 5జీ అందుబాటు, అలాగే ఒక ప్రాంతంలో ఉన్న నెట్వర్క్ ట్రాఫిక్‌పై ఆధారపడి ఉంటుంది. టెలికాం కంపెనీకి చెందిన ఒకే ఈసిమ్, ఫిజికల్ సిమ్‌లను కొనుగోలు చేయడంతోపాటు దాదాపు ఒకే స్థాయి వేగం లభిస్తుంది.
eSIMవల్ల ప్రయోజనాలేంటి?
ఇంటర్నెట్ స్పీడ్‌లో మార్పులేనప్పటికీ.. ఈసిమ్ ద్వారా వినియోగదారులకు అనేక సౌకర్యాలు లభిస్తున్నాయి. అవేంటంటే..
- ఫిజికల్ సిమ్ అయితే చిన్నదిగా ఉంటే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈసిమ్తో ఆ బాధ ఉండదు.
- అసలు సిమ్‌నే ఉండదు కాబట్టి సిమ్ డ్యామేజ్ అవుతందన్న భయమే అవసరం లేదు.
- ఒకే ఫోన్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఈసిమ్ ప్రొఫైల్స్‌ను సేవ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి నెట్‌వర్క్‌ను మార్చుకోవచ్చు.
- ముఖ్యంగా విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి టెలికాం కంపెనీ ఈసిమ్ ప్రొఫైల్‌ను వెంటనే డౌన్లోడ్ చేసుకుని యాక్సెస్‌ను పొందవచ్చు. కొత్త సిమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
- ఫోన్ దొంగతనానికి గురైనప్పుడు సిమ్సి తీసేందుకు అవకాశం ఉండదు. దీనితో కొంతమేరకు భద్రత కూడా మెరుగుపడుతుంది.
eSIM ప్రతికూలతలు
చాలామందికి ఫిజికల్ సిమ్‌నే అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే..
- ఫిజికల్ సిమ్‌ను ఈజీగా ఒక ఫోన్ నుంచి మరో ఫోన్‌కు మార్చుకోవచ్చు. వెంటనే కొత్త డివైజ్‌ల్లో ఉపయోగించుకోవచ్చు. కానీ ఈసిమ్‌ను అంత సులువుగా వేరే ఫోన్లలోకి మార్చుకోలేం. ఫోన్ రిపేర్ వచ్చినా.. కొత్త ఫోన్ తీసుకున్నా వెంటనే సిమ్‌ను యాక్టివేట్ చేసుకోలేం.
- సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారు ఈసిమ్‌ను యాక్టివేట్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారికి ఈసిమ్నే అనుకూలంగా ఉంటుంది.
- ఫిజికల్ సిమ్ అయితే ఏ ఫోన్అయినా పని చేస్తుంది.. కానీ ఈసిమ్ అయితే అన్ని ఫోన్లలో అందుబాటులో లేదు.
ఫిజికల్ సిమ్vs eSIM వాటిలో ఏది బెటర్?
మీ ఫోన్లో ఈసిమ్ సపోర్టు ఉండి, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమై కనెక్టివిటీ కావాలని అనుకుంటే ఈసిమ్ తీసుకోవడం బెటర్ అయితే తరచుగా ఫోన్లు మార్చేవారు లేదా సిమ్‌ను ఇతర డివైజ్‌ల్లో ఉపయోగించే వారు ఫిజికల సిమ ఉండటం మంచిది.

