మానవాళి ఊహలకు జీవం పోస్తూ, అధునాతన సాంకేతిక విప్లవంగా అవతరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు తన గీతాన్ని దాటింది! మనిషిని సవాల్ చేస్తూ, డిజిటల్ ప్రపంచంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. “ఏఐ స్వయంప్రతిపత్తి సాధిస్తే ప్రమాదం తప్పదు” అని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్న భయాలు ఇప్పుడు అక్షరాల నిజమవుతున్నాయి. ప్రపంచ ప్రసిద్ధ ఏఐ పరిశోధనా సంస్థ ఓపెన్ ఏఐ తయారు చేసిన ఒక ఏజెంట్.. తన పరిధులను దాటేసింది. మరో ప్రముఖ టెక్ సంస్థ ‘హగ్గింగ్ ఫేస్’పై రాత్రికి రాత్రే దాడికి దిగింది. ఇది కేవలం సాంకేతిక లోపం కాదు, ముంచుతున్న విపత్తుకు ముందస్తు హెచ్చరిక! ఏఐ స్వయంప్రతిపత్తి పేరుతో సాగుతున్న ఈ ప్రయోగాలు రేపటి రోజున మనిషి ఉనికికే ఎసరు తెడతాయా? లెట్స్ వాచ్.
జూలై 9న ఓపెన్ ఏఐఐ సురక్షితమైన టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి ఒక ఏఐ ఏజెంట్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. అత్యంత శక్తివంతమైన GPT-5.6 సోల్‌తో పాటు ఇంకా విడుదల చేయబడలేదు మరొక శక్తివంతమైన మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ సాంకేతిక సాంకేతికత, సరిహద్దులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత కేవలం రెండు రోజుల వ్యవధిలోనే, అంటే జూలై 11న, ఏఐ టూల్స్ కు ల్యాబ్‌గా వ్యవహరించే హగ్గింగ్ ఫేస్ డిజిటల్ వ్యవస్థల్లోకి అక్రమంగా చొరబడింది. జూలై 11 నుండి జూలై 13 పూర్తి స్థాయిలో హ్యాకింగ్‌కు చేరుకుంది. దాన్ని గందరగోళం చేసింది. ఇంత జరుగుతున్నా, ఓపెన్ ఏఐ కనీసం దానిని గుర్తించలేకపోయింది.
జూలై 16న హగ్గింగ్ ఫేస్బుక్ సంస్థ ‘తమపై ఒక ఆటానమస్ ఏజెంట్‌పై దాడి చేసి, ఫేస్బుక్లో ఈ హ్యాకింగ్ గురించి ఎవరికీ తెలీదు. ఇప్పటికే హగ్గింగ్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు థామస్ వోల్ఫ్ సమక్షంలో ఈ అంశంపై FBIకి కూడా ఫిర్యాదు చేశారు.
హగ్గింగ్ ఫేస్ హ్యాకింగ్ ఘటన అకస్మాత్తుగా జరిగింది కాదు. దీనికి ముందే ఓపెన్ ఏఐ సిస్టమ్స్‌లో ఆందోళన సంకేతాలు కనిపించాయి. మోడల్స్ టెస్టింగ్ సమయంలో అవి తమ భవిష్యత్తు వర్షన్ల కోసం రహస్య సూచనలు, సూచనలను నోట్ రూపంలో ఉంచినట్లు ఆధారాలు లభించాయి. తమను తాము సంస్థ విధించిన నియంత్రణల నుంచి ఎలా విముక్తి చేసుకోవాలో అందులో రాసి ఉండటం తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. , అంతకు జరిగిన పరీక్షల్లో ఏఐ ఏజెంట్లు తమను పర్యవేక్షించే మానిటరింగ్ సిస్టమ్స్‌ను సైతం డిస్కనెక్ట్తో సహా ముందు ఆధారాలు లభించాయి. పర్యవేక్షణను దాటవేసేందుకు ఏఐ మోడల్స్ అబద్ధాలు ఆడటం, మోసపూరిత మార్గాలను మనుషులు, హ్యాకింగ్‌కు దిగడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పాలిసేడ్ రీసర్చ్ ప్రతినిధి జెఫ్రీ లాడిష్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఏఐ పరిశోధన పడుతున్న సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. మార్కెట్లోకి వేగంగా, అత్యంత ప్రతిభావంతమైన మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చే తొందరలో భద్రతా విధానాలను గాలికి వదిలేస్తున్నాయి. ఓపెన్ ఏఐ ఒకేసారి అనేక మోడల్స్ ను ఎవాల్యుయేట్ చేస్తోంది. దీనితో అధిక వేగంతో నిర్వహించడం వల్ల ఉత్పన్నమయ్యే డేటాను నివేదనలో ఉద్యోగులు సైతం వెనుకబడి ఉన్నారు. ఈ నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తోంది. ఓపెన్ ఏఐ సిబ్బంది ఏఐ ఏజెంట్‌ను గాలికొదిలేశారా? లేక అది హ్యాకింగ్ చేస్తుంటే ఎలా అడ్డుకోవాలో తెలియక చేతులెత్తేశారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానాలు లభించాల్సి ఉంది.
మనుషుల ప్రమేయం లేకుండా 24 గంటలు పనిచేసే వర్చువల్ ఉద్యోగులను సృష్టించడానికి అత్యాశ, డిజిటల్ ప్రపంచాన్ని అరాచకం వైపు నెడుతోంది. ఓపెన్ ఏఐ త్వరలోనే ఐపీఓ ద్వారా బిలియన్ డాలర్ల నిధులను సమీకరించేందుకు సిద్ధమవుతున్న ఈ కీలక సమయంలో, ఈ ఘటన ఆ సంస్థ విశ్వసనీయతపై పెద్ద దెబ్బ కొట్టింది. ఓపెన్ ఏఐ ప్రతినిధులు ఈ ఘటనపై తమకు ఒక ముందస్తు హెచ్చరిక అని, విదేశీ నిపుణులతో కలిసి సాంకేతిక నివేదికను తెలియజేస్తున్నాము. అయినా, ప్రభుత్వాల కఠిన నియంత్రణలు లేకపోతే లాభాల వేటలో ఉన్న కంపెనీలు భద్రతను పక్కన పెట్టే ప్రమాదం ఉంది.
సాంకేతికత మనిషి ప్రగతికి ఊపిరిగా మారాలి గానీ, మనిషి ఉనికినే ప్రశ్నించేలా మారకూడదు. ఓపెన్ ఏఐ ఏజెంట్ ఈ హ్యాకింగ్ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే. సరిహద్దులు లేని ఏఐ రేసులో భద్రతా వ్యవస్థలను పటిష్టం చేయకపోతే, రేపు ఈ ‘రెక్లెస్’ ఏఐ వ్యవస్థలు మన కీలకమైన సౌకర్యాలు, రక్షణ వ్యవస్థలు, డేటాపై దాడి చేయవన్న గ్యారెంటీ ఏంటి? శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరచి కఠిన చట్టాలు, నియంత్రణలు తీసుకురావాలి. లేకపోతే.. మనిషి సృష్టించిన ఏఐయే, మనిషికి అంత శత్రువుగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయ్!
: CLN రాజు (ఎడిటర్- NTV డిజిటల్)

