FIFA WC 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు టర్కీపై 2-0తో అద్భుత విజయంతో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్ ద్వారా భారత సంతతికి చెందిన వింగర్ నిషాన్ వేలుపిళ్లై ఫిఫా ప్రపంచ కప్‌లో అధికారికంగా అరంగేట్రం చేశాడు. దీనితో ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెగా టోర్నీ ఫిఫా వరల్డ్ కప్ బరిలోకి దిగిన తొలి భారత సంతతి ఫుట్ బాలర్‌గా నిషాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఆంగ్లో ఇండియన్ మూలాలు.. సబ్ డిగ్రీగా మైదానంలోకి!
25 ఏళ్ల నిషాన్ వేలుపిళ్లై ఆంగ్లో-ఇండియన్ కుటుంబానికి చెందినవాడు. అతని తల్లి గిలియన్ వేలుపిళ్లై భారతీయ మూలాలు ఉన్న మహిళ ఉండటం. ఆస్ట్రేలియా జట్టులో మోస్ట్ టాలెంటెడ్ యువ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న నిషాన్ వేలుపిళ్లై.. ఆదివారం టర్కీతో జరిగిన గ్రూప్-డి మ్యాచ్‌లో 61వ నిమిషంలో సబ్గ్రేడ్గా స్టేడియంలోకి అడుగుపెట్టాడు. మ్యాచ్ ముగిసేవరకు డిఫెన్స్‌లో ఎంతో పటిష్టంగా రాణించాడు. ఆస్ట్రేలియా తన 2-0 ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
చైనాపై అరంగేట్ర గోల్‌తో మొదలైన ప్రస్థానం
ఆస్ట్రేలియాలోని స్థానిక క్లబ్‌లు, మెల్బోర్న్ విక్టరీ అకాడమీ ద్వారా నిషాన్ వేలుపిళ్లై ప్రొఫెషనల్ ఫుట్‌బాల్‌లోకి దూసుకొచ్చాడు. 2024లో చైనాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిషాన్ వేలుపిళ్లై.. మైదానంలోకి వచ్చిన కేవలం 7 నిమిషాల్లోనే గోల్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పటి నుంచి నిషాన్ కెరీర్ వేగంగా దూసుకెళ్లింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ ఆటగాడు 3 కీలక గోల్స్ సాధించాడు.
కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న నిషాన్ వేలుపిళ్లై
క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల్లో నిషాన్ వేలుపిళ్లై చూపించిన అసాధారణ ప్రతిభే ఆస్ట్రేలియా హెడ్ కోచ్ టోనీ పోపోవిక్ను ఆకట్టుకుంది. దీనితో ప్రపంచ కప్ ఆడే 26 మంది సభ్యుల తుది ఆస్ట్రేలియా జట్టులో నిషాన్‌కు చోటు దక్కింది. టర్కీతో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సాధారణంగా అటాకింగ్ ఆడే నిషాన్‌కు కోచ్ రక్షణ బాధ్యతలను అప్పగించారు. టర్కీ ఫార్వర్డ్ గోల్ చేయకుండా అడ్డుకోవడంలో నిషాన్ క్రమశిక్షణతో కూడిన ఆటను ప్రదర్శించి కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
ఆస్ట్రేలియా సంచలనం.. టర్కీ షాక్!
ఈ మ్యాచ్‌లో మొదటగా 27వ నిమిషంలో 20 ఏళ్ల నెస్టోరీ ఇరాన్‌కుందా అద్భుతమైన ఫీల్డ్ గోల్ చేసి ఆస్ట్రేలియాకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 75వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ 20 గజాల దూరం నుంచి బంతిని నెట్లోకి పంపి స్కోరును 2-0 గా మార్చాడు. సుదీర్ఘమైన 24 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఆడుతున్న టర్కీని ఆస్ట్రేలియా రక్షణ శ్రేణి సరిగ్గా అడ్డుకుంది. నిషాన్ వేలుపిళ్ల వంటి యువ రక్తం తోడవడంతో ఆస్ట్రేలియా ఈ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుని నాకౌట్ రేసులో ముందంజ వేసింది.
కథ మొదట ప్రచురించబడింది: ఆదివారం, జూన్ 14, 2026, 19:37 (IST)
ఇతర కథనాలు ప్రచురించబడ్డాయి జూన్ 14, 2026

