దేశంలోని పలు రాష్ట్రాలు వర్ష (భారీ వర్షం హెచ్చరిక)తీవ్రత తగ్గుదల సూచనలు లేవని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ఆందోళన పెరిగింది.
imd భారీ వర్షపాతం రెడ్ అలర్ట్ మరియు బహుళ రాష్ట్రాలకు వరదల హెచ్చరిక
- భారీ వర్షాల హెచ్చరిక
- తీవ్రమైన అల్పపీడనాల ప్రభావం
- ఆకస్మిక వరదల ముప్పు
Heavy Rain Alert: నైరుతి రుతుపవనాల విలయతాండవంతో దేశంలోని పలు రాష్ట్రాలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం గడుపుతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షం(Heavy Rain Alert) తీవ్రత ఏమాత్రం తగ్గే సూచనలు కనిపిస్తే లేవని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. పశ్చిమ విక్షోభం, అల్పపీడనాలు జతకట్టడంతో భానుడి తాపానికి విరామం లభించలేదు, ఆకస్మిక వరదలు, ఈదురుగాలుల ముప్పు ముంచుతోంది. రాబోయే 24 గంటల్లో ప్రజలు, అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన అల్పపీడనాలు: పలు జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు:
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, కొంకణ్-గోవా ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్లోని సంతల్పూర్లో రికార్డు స్థాయిలో 390 మిమీ వర్షపాతం నమోదైంది. నైరుతి రాజస్థాన్, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు, రుతుపవన ద్రోణితో తోడవ్వడంతో ఏపీ, తెలంగాణ, హిమాచల్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే గంటకు 50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో సౌరాష్ట్ర, కచ్, జార్ఖండ్ లోతట్టు ప్రాంత ప్రజల అధికారులు అలర్ట్ చేశారు.

