హైకోర్టు: హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. రంగనాధ్ ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని చీఫ్ సెక్రటరీని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించడమే కాకుండా, కోర్టు ఉత్తర్వులను కూడా పాటించడం లేదని తెలిపారు.
ఐజీ స్థాయి అధికారిని…
ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించింది. రంగనాధ్ పై అరవై మూడు కోర్టు థిక్కరణ పిటీషన్లు ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, కోర్టు ఉత్తర్వులను ఇన్ని సార్లు థిక్కరించడం సరికాదని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

