ఇండియా vs ఆఫ్ఘనిస్తాన్ టెస్ట్: దాదాపు 7 నెలల విరామం తర్వాత ప్లేయర్లు తెలుపు రంగు దుస్తులు వేసుకోబోతున్నారు. స్వదేశం వేదికగా ఆఫ్గనిస్తాన్ జట్టుతో ఏకైక టెస్ట్ ఆడబోతున్నారు. టెస్ట్ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ పసికూన. అలాగని ఆ జట్టులో భయంకరమైన ప్లేయర్లు ఉన్నారు. ఏదైనా జరగనిది జరిగితే భారత్కు ఇబ్బంది తప్పదు. అసలే డబ్ల్యూటీసీ పాయింట్లలో భారత్ ఆరవ స్థానంలో ఉంది. అలాంటప్పుడు ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగే ఏకైక మ్యాచ్ భారత జట్టుకు అత్యంత ముఖ్యమైనది. ఈ మ్యాచ్లో భారత్ భారీ తేడాతో గెలిస్తే.. డబ్ల్యూటీసీ పాయింట్లలో తన స్థానాలను మెరుగుపరుచుకుంటుంది.
చండీగఢ్ కొత్త స్టేడియంలో శనివారం నుంచి ఈ టెస్ట్ జరుగుతుంది.. ఇటీవల ఈ మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో రషీద్ ఖాన్ లేడు. అలాగని ఆ జట్టు అంత సులభంగా కనిపించడం లేదు. క్రికెట్లో పెద్ద పెద్ద జట్లకు షాక్ ఆఫ్ఘనిస్తాన్.. టెస్ట్ క్రికెట్లో కూడా అదే స్థాయిలో ఆడితే మాత్రం భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు.
టెస్ట్ క్రికెట్లో స్వదేశంలో టీం ఇండియాకు గతంలో తిరుగు లేని రికార్డు ఉండేది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల చేతిలో దారుణమైన పరాభవాలు ఎదురుకావడం వల్ల ఆట తీరును ప్రశ్నార్థకం చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వీడ్కోలు పలికిన తర్వాత టెస్ట్ జట్టు కాస్త కళ తప్పింది. ఈ మ్యాచ్లో జడేజా కూడా లేడు. అశ్విన్ రిటర్మెంట్ తీసుకోవడం.. జడేజా లేకపోవడం ఒకరకంగా టీమ్ ఇండియాకు ఇబ్బంది. భారత స్పిన్ విభాగాన్ని కులదీప్ యాదవ్ ముందుండి నడిపించాల్సిన అవసరం ఉంది. వాషింగ్టన్ సుందర్ కూడా అతనికి సహకారం అందిస్తాడు. ఇక హర్ష్ దూబే, మానవ సుతార్ ఎవరో ఒకరు జట్టులోకి వస్తారు. సిరాజ్ పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం ఇస్తాడు. ప్రసిద్ధి కృష్ణ అతడితోపాటు బంతి పంచుకుంటాడు. బుమ్రాకు విశ్రాంతి.. ఓపెనర్లుగా జైస్వాల్, కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతారు.. సాయి సుదర్శన్ మూడో స్థానం..గిల్, పంత్, జురెల్, సుందర్ తర్వాత స్థానాల్లో బ్యాట్ అందుకుంటారు.
2018లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో భారత్ బెంగళూరు వేదికగా ఒక టెస్ట్ ఆడింది. 262 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ మైదానంలో నల్లటి మట్టితో కూడిన పిచ్ రూపొందించారు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. వర్షం ముప్పు లేదు. కాకపోతే ప్రారంభంలో పేస్ బౌలర్లకు.. ఆ తర్వాత స్పిన్ బౌలర్లకు మైదానం అనుకూలిస్తుంది.
శ్వేతజాతీయులలో ప్రయాణాన్ని పునఃప్రారంభించడానికి అంతా సిద్ధంగా ఉంది
కొత్త చండీగఢ్
⏰ ఉదయం 9.30 IST
https://t.co/hIL8Vefajg
అధికారిక BCCI యాప్#టీమిండియా | #INDvAFG | @IDFCFIRSTబ్యాంక్ pic.twitter.com/xzCVKwyJ9O— BCCI (@BCCI) జూన్ 5, 2026

