చండీఘర్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక సిక్సర్లు (61) కొట్టిన తొలి బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు. బుధవారం (మే 27) సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ఎనిమిది సిక్సర్లు బాదడం ద్వారా వైభవ్ ఈ రేర్ ఫీట్ నెలకొల్పాడు. అందుకు దిగ్గజ బ్యాటర్ క్రిస్ గేల్ ఆల్ టైం ఐపీఎల్ రికార్డ్‌ను 15 ఏళ్ల బుడ్డోడు బద్దలుకొట్టాడు. గతంలో ఈ రికార్డ్ గేల్ పేరుతో ఉండేది. 2012 సీజన్లో గేల్ 59 సిక్సర్లు కొట్టాడు. ఇప్పటి వరకు ఇదే హయ్యస్ట్. గేల్ 14 ఏళ్ల ఆల్ టైం ఐపీఎల్ రికార్డును 15 ఏళ్ల వైభవ్ తుడిచిపెట్టడం ఉంది.
వైభవ్ ఊచకోత..
ఐపీఎల్ 19లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి తృటిలో రికార్డ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన మూడో ఓవర్లో వైభవ్ పిచ్చకొట్టుడు కొట్టాడు. 4, 6, 6, 6, 1లతో ఏకంగా 23 రన్స్ బాదాడు.
సాకిబ్ హుస్సేన్ వేసిన నాలుగో ఓవర్లలో వరుసగా 6, 6, 6తో చెలరేగాడు. బౌలర్లపై కనికరం చూపకుండా ఊచకోత కోశాడు. వైభవ్ విధ్వంసంతో ఆర్ఆర్ భారీ స్కోర్ చేసింది. కాగా, రాయ్‌పూర్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ మొదట బ్యాటింగ్‌కు దిగింది.
ఐపీఎల్ ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు:
ఆటగాడు సిక్సులు
వైభవ్ సూర్యవంశీ 61
క్రిస్ గేల్ 59
ఆండ్రీ రస్సెల్ 52
జోస్ బట్లర్ 45
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “IPL 2026: గేల్ ఆల్ టైం రికార్డ్ బద్దలు.. ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన వైభవ్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

