- RCB ఫీల్డింగ్ ఎంచుకుంది, GT 155/8 పరుగులు చేసింది.
- వాషింగ్ సుందర్ 50* పరుగులు, రసిక్ సలామ్ 3 వికెట్లు తీశాడు.
- ఛాంపియన్‌కు రూ. 20 కోట్లు, రన్నరప్‌కు రూ. 12.5 కోట్లు.
IPL 2026 ఫైనల్ RCB vs GT లైవ్ స్కోర్ అప్డేట్: ఐపీఎల్ 2026 లీగ్ ముగింపు దశకు వచ్చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ రంజుగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంపికయ్యాడు. దీనితో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో జీటీ 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ ఫిఫ్టీ (37 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు ) సూపర్బ్ బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలర్లలో రసిక్ సలామ్ కు మూడు వికెట్లు దక్కాయి.
ఇది కూడా చదవండి: IPL 2026 GT vs RCB గ్రాండ్ ఫైనల్: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైనల్లో జీటీని తక్కువ స్కోరుకే పరిమితం.. రాణించి వాషింగ్టన్, రసిక్
రూ. 20 కోట్ల భారీ ప్రైజ్ మనీ..
ఈ సీజన్లో కూడా BCCI గత ఏడాది లాగే భారీ ప్రైజ్ మనీ స్ట్రక్చర్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఛాంపియన్‌గా నిలిచే టీమ్‌కు రూ. 20 కోట్ల క్యాష్ రివార్డ్ దక్కుతుంది. అలాగే ఫైనల్ లో ఓడి రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ. 12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. లీగ్ లో మూడో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ కు కూడా భారీ మొత్తమే దక్కనుంది. టీమ్ అవార్డులతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన ఇండివిడ్యువల్ ప్లేయర్లకు కూడా బోర్డు ప్రత్యేక క్యాష్ ప్రైజ్ లు ఇవ్వనుంది.
🚨 IPL 2026 అవార్డులు & ప్రైజ్ మనీ విజేతలు 🚨
🟠 ఆరెంజ్ క్యాప్ – వైభవ్ సూర్యవంశీ – ₹10 లక్షలు
🟣 పర్పుల్ క్యాప్ – కాసిగో రబాడా (GT) – ₹10 లక్షలు
🏅 4వ స్థానం – రాజస్థాన్ రాయల్స్ (RR) – ₹6.5 కోట్లు
🥉 3వ స్థానం – సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – ₹7 కోట్లు
🥈 రన్నర్స్-అప్ – గుజరాత్ టైటాన్స్… pic.twitter.com/v9em8cd1Qz
— మఫ్ఫట్బాల్ విక్రాంత్ (@Vikrant_1589) మే 31, 2026
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు.. ఎమర్జింగ్ ప్లేయర్ గా సూర్యవంశీకి ఛాన్స్
టోర్నమెంట్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ విన్నర్ కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 776 రన్స్ తో టాప్ లో ఉన్నాడు.అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ తో పాటు రూ. 10 లక్షలు అందుతాయి. గుజరాత్ పేసర్ కాగిసో రబడ 28 వికెట్లతో తీయగా, ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో అన్ని వికెట్లు ఉన్నాయి . అత్యంత వాల్యుబుల్ ప్లేయర్ కు రూ. 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కు రూ. 20 లక్షలు దక్కనున్నాయి.
ఇంకా చదవండి

