ఐపీఎల్ 2026లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ 57 బంతుల్లో 96 పరుగులు చేసి సెంచరీ మిస్ చేసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ విరామ సమయంలో తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన, జోష్ ఇంగ్లిష్తో భాగస్వామ్యం , పిచ్ ప్రవర్తన గురించి మాట్లాడారు. “ఇన్స్ చివర్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు చాలా అద్భుతంగా బౌలింగ్ చేసారు. ఆ సమయంలో క్రీజులో బ్యాటింగ్ చేయడం ఒక రకమైన ‘టార్చర్’ లాగా అనిపించింది. చివరి ఓవర్లలో మేము అనుకున్నట్లు మరో రెండు, మూడు బౌండరీలు రాబట్టలేకపోయాము. ఒకవేళ ఆ పరుగులు వచ్చి ఉంటే ఇంకా సంతోషించేవాళ్లం. కానీ క్రెడిట్ మొత్తం రాజస్తాన్ బౌలర్లకే దక్కుతుంది.
“గడిచిన ఐదేళ్లలో క్రికెట్ చాలా మారిపోయింది. ఒక ఐదేళ్ల క్రితం 220 పరుగులు చేస్తే.. చేతిలో డిఫెండ్ చేయడానికి మంచి స్కోరు ఉందని చాలా నమ్మకంతో మైదానం వీడేవాళ్లం. కానీ ఈ రోజుల్లో ఈ స్కోరు సరిపోదు.
ఇక జోష్ ఇంగ్లిష్తో నా భాగస్వామ్యం విషయానికి వస్తే.. మేము ఇద్దరం కలిసి చాలా క్రికెట్ ఆడాము. అతని బ్యాటింగ్ శైలి నాపై ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. మా మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంది. ఈ రోజు మేము నెలకొల్పిన భాగస్వామ్యం జట్టును విజయతీరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నాను.
పిచ్ గురించి బౌలర్లకు ఇచ్చిన సలహా..
“ఇది బ్యాటింగ్‌కు చాలా అనుకూలమైన అద్భుతమైన వికెట్. ఇక్కడ మంచి బంతులు కూడా ఫోర్లు, సిక్సర్లుగా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి బౌలర్లకు ‘ఎగ్జిక్యూషన్’ చాలా ముఖ్యం. బౌలింగ్ రన్-అప్ స్టార్ట్ చేసే ముందు ఏ బంతి వేయాలంటే అది బౌలర్‌గా పూర్తి అవుతుంది. అప్పుడే ఈ పోరులో నిలబడాలి.”
తన రనౌట్ గురించి మాట్లాడుతూ.. అది కేవలం దురదృష్టం మాత్రమే అని.. ఒక్కోసారి ఆటలో ఇలాంటివి సహజంగా జరుగుతుంటాయి.. సెంచరీ మిస్ అయిందన్న బాధ లేదు.. దాని గురించి అస్సలు ఆలోచించలేదని అన్నారు.

