IPL 2026 GT vs RCB లైవ్ అప్డేట్లు: ఐపీఎల్ టైటిల్ ను వరుసగా రెండోసారి అందకు డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అడుగు ముందుకేసింది. గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న ఫైనల్లో టాస్ గెలిచి, ప్రత్యర్థిని బ్యాటింగ్ కు ఆహ్వానించి, తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో జీటీ 8 వికెట్లకు 155 పరుగులు చేసింది. స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్టన్నింగ్ ఫిఫ్టీ (37 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు ) సూపర్బ్ బ్యాటింగ్ తో అద్భుత ప్రదర్శన చేశాడు. బౌలర్లలో రసిక్ సలామ్ ఉకు మూడు వికెట్లు దక్కాయి. జీటీ టాప్ త్రీ అయిన సాయి సుదర్శన్, కెప్టెన్ శుభమాన్ గిల్, జోస్ బట్లర్ లను తక్కువ స్కోరుకే పరిమితం చేసి, ప్రత్యర్థిని తక్కువ రన్స్ కే నిలువరించింది. ఈ పిచ్ పై దాదాపుగా 20 పరుగులు తక్కువగా జీటీ సాధించిందని విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు ఓ మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిస్తే, బ్యాక్ టూ బ్యాక్ ఐపీఎల్ టైటిళ్లను సాధించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ సరసన రజత్ పాటిదార్ నిలిచారు.
ఇన్నింగ్స్ బ్రేక్!
వాషింగ్టన్ సుందర్ తిరిగి పోరాడాడు కానీ ఆల్ రౌండ్ ప్రయత్నం చేశాడు #RCB పరిమితం చేస్తుంది #GT 1️⃣5️⃣5️⃣ వరకు
స్కోర్‌కార్డ్ ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #ఫైనల్ | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/1nMfBYvg1D
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 31, 2026
ఓపెనర్లు విఫలం..
టోర్నీలో జట్టు వెన్నెముకగా నిలిచిన జీటీ ఓపెనర్లు గిల్, సుదర్శన్ ఘోరంగా విఫలమయ్యారు. గ’త రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ గా వెనుదిరిగిన ఈ మ్యాచ్‌లో సుదర్శన్ (12), రెండు ఫోర్లతో టచ్‌లో కనిపించాడు. అయితే భువ’నేశ్వర్ కుమార్ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందే గిల్ (10) ను జోష్ హేజిల్ వుడ్ పెవిలియన్ కు పంపాడు. దీంతో 26 పరుగులకే జీటీ రెండు కీలక కోల్పోయింది. ఈ దశలో వ్యూహాత్మకంగా నిశాంత్ సింధు (20)ను వన్ డౌన్ బ్యాటర్ గా పంపిన ఫలితం లేకపోయింది. మరోవైపు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన జోస్ బట్లర్ (19) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఒక ఫోర్ మాత్రమే కొట్టిన బట్లర్ చాలా బంతులు వేస్ట్ చేసి, త్వరగా పెవిలియన్ కు చేరాడు.
క్లచ్ ✅ వస్తోంది
ఫైటింగ్ ఫిఫ్టీ 💪తో వాషింగ్టన్ సుందర్
నవీకరణలు ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #ఫైనల్ | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/dwEHzKRMMO
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 31, 2026
వాషింగ్టన్ పోరాటం..
55/3 తో కష్టాల్లో ఉన్న దశలో బ్యాటింగ్‌కు దిగిన వాషింగ్టన్ సుందర్.. జీటీకి పోరాడగలిగే స్కోరును అందించాడు. చివరికంటా నిలిచి, అర్ధ సెంచరీని సాధించాడు. మరోవైపు ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో జీటీ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. ముఖ్యంగా అర్షద్ ఖాన్ (15), రాహుల్ తెవాటియా (7), జేసన్ హోల్డర్ (7) నిరాశ పర్చారు. మరోవైపు ఒంటరి పోరాటం చేసిన వాషింగ్టన్ 37 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
ఇది కూడా చదవండి: RCB vs GT IPL ఫైనల్: ఫైనల్లో ఎంత స్కోర్ ఈజీగా ఛేజ్ చేయవచ్చు? నెగ్గాలంటే ఫస్ట్ బ్యాటింగ్ టీం ఎంత స్కోర్ చేయాలి
ఇంకా చదవండి

