IPL 2026 PBKS VS LSG తాజా అప్డేట్: ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జులు విదిల్చింది. టేబుల్ బాటమ్ లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్లతో ఘన విజయం. అంతకుముందు లక్నోలో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 196 పరుగులు చేసింది. ఓపెనర్ జోష్ ఇంగ్లీష్ స్టన్నింగ్ ఫిప్టీ (44 బంతుల్లో 72, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లలో మార్కో యన్సెన్, యజ్వేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీశాడు. అనంతం ఛేజింగ్ ను పంజాబ్ కింగ్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఇన్సింగ్‌తో అజేయ సెంచరీ (51 బంతుల్లో 101 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) తో టాప్ స్కోరర్‌గా నిలవడంతో కేవలం 18 ఓవర్లలోనే 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లతో సత్తా చాటాడు. ఈ విజయంతో నాకౌట్ అవకాశాలు పంజాబ్ మెరుగుపర్చుకుంది. ఇక చివరి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ఓడిపోతే, పంజాబ్ ప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది. ఇక పంజాబ్ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు అయింది. ఇక ఆదివారం జరిగే డబుల్ హెడ్ర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
𝙎𝙝𝙧𝙚𝙮💯
ఛేజ్‌లో అద్భుతమైన ప్రదర్శన మరియు 𝗺𝗮𝗶𝗱𝗲𝗻 #TATAIPL 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 శ్రేయాస్ అయ్యర్ కోసం 👏
నవీకరణలు ▶️ https://t.co/2ADKr4dqhi#ఖేల్ బిందాస్ | #LSGvPBKS pic.twitter.com/Q5sabMbsOo
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 23, 2026
..
ఇంకా చదవండి

