IPL 2026 ప్లేఆఫ్‌లు : ఇప్పటివరకు ఐపీఎల్ జోరుగా సాగింది. అభిమానులకు వీనులవిందైన క్రికెట్ ఆనందాన్ని అందించింది. ఇకపై ఐపీఎల్ ఆట తీరు మారబోతోంది. మంగళవారం నుంచి ప్లే ఆఫ్ సమరం షురూ అవుతోంది. ధర్మశాల వేదికగా బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ పోటీ పడుతోంది. క్వాలిఫైయర్ 1లో భాగంగా ఈ పోటీ జరుగుతోంది.
రెండు జట్లలో ప్లేయర్లు అద్భుతంగా ఉన్నారు. పోటీ చూడకపోతే రసవత్తరంగా సాగే అవకాశం వచ్చింది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సరే నేరుగా ఫైనల్ వెళ్లొచ్చు. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ వెళ్తుంది. క్వాలిఫైయర్‌లో విజేత జట్టుకు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ పోరు జరుగుతుంది.
ప్లే ఆఫ్ సమరం జరుగుతున్న నేపథ్యంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. క్వాలిఫైయర్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ట్రోఫీ గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. గత పరిణామాలు కూడా దీనినే నిరూపించాయి. 2011 నుంచి ప్లే ఆఫ్ విధానం అమల్లో ఉంది. నాటి నుంచి 15 సీజన్లు జరిగాయి. 12 సార్లు క్వాలిఫైయర్ 1 లో గెలిచిన జట్టు ట్రోఫీ సొంతం చేసుకుంది. 2013, 2016, 2017లో మాత్రం విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. మిగిలిన సందర్బాలలో మాత్రం క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టే ఐపీఎల్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. 2011లో చైన్నై, 2012,2014లో కోల్ కతా, 2015లో ముంబయి, 2018లో చెన్నై, 2020లో ముంబయి, 2021లో చెన్నై, 2022లో గుజరాత్, 2023లో చెన్నై, 2024లో కోల్ కతా, 2025లో బెంగళూరులో సరికొత్త చరిత్ర.
2013లో క్వాలిఫైయర్ 1లో చైన్నై ఎదుట ముంబయి నిలబడలేకపోయింది. క్వాలిఫైయర్ 2 లో రాజస్థాన్ పై గెలిచిన ముంబయి .. పైనల్ మ్యాచ్ లో చెన్నైమీద గెలిచి ట్రోఫీ అందుకుంది. 2016లో సన్ రైజర్స్ అదరగొట్టింది. నాలుగో స్థానంలో నిలిచిన వార్నర్ సేన ఏకంగా విజేత అయింది. ఎలిమినేటర్ లో కోల్ కతాను ఓడించింది. క్వాలిఫైయర్ 2లో గుజరాత్ ను మట్టి కరిపించింది. ఫైనల్ పోరులో బెంగళూరును ఓడించి ట్రోఫీ అందుకుంది.
2017లో క్వాలిఫైయర్ లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ ఓటమి పాలైంది. క్వాలిఫైయర్2లో కోల్ కతాను ఓడించింది. చివరి పోరులో ముంబయి ఒక్క పరుగు తేడా పూణె మీద గెలిచి ట్రోఫీని దక్కించుకుంది ముంబయి ఇండియన్స్.

