IPL 2026 RCB VS GT ఫలితాల నవీకరణ: డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్బుతం చేసింది. ఈ సీజన్లో తొలిసారిగా ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్టుగా నిలిచిన ఆర్సీబీ.. తన రికార్డును నిలబెట్టుకుంటూ, ఫైనల్లోకి కూడా ప్రవేశించింది. ధర్మశాలలో మంగళవారం జరిగిన క్వాలిఫయర్ -1లో మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ పై 92 పరుగులతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఫైనల్లోకి ప్రవేశించింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ 5 వికెట్లు 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇదే అత్యధిక స్కోరు కావటం విశేషం. రజత్ పతిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ (33 బంతుల్లో 93 నాటౌట్, 5 ఫోర్లు, 9 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. జాసన్ హోల్డర్, కగిసో రబాడకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం చేజింగ్ లో 19.3 ఓవర్లలో గుజరాత్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. ఫినిషర్ రాహుల్ తెవాటియా సూపర్బ్ ఫిఫ్టీ (43 బంతుల్లో 68, 8 ఫోర్లు, 4 సిక్సర్లు) తో టాప్ స్కోరర్‌గా నిలిచి, ఒంటరి పోరాటం బౌలర్లలో జేకబ్ డఫీ మూడు వికెట్లతో రాణించాడు. ఈ విజయంతో ఆర్సీబీ ఫైనల్ కు వెళ్లగా, జీటీ, క్వాలిఫయర్ 2కి పడిపోయింది. బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ విజేతతో జీటీ తలపడుతుంది. ఇందులో గెలిచిన జట్టుతో ఫైనల్లో ఆర్సీబీ తలపడనుంది.
అలా మీరు 𝗣𝗟𝗔𝗬 𝗕𝗢𝗟𝗗! ❤️
డిఫెండింగ్ ఛాంపియన్స్ @RCBTweets వరసగా రెండో స్థానానికి చేరుకుంటున్నారు #TATAIPL చివరి 👏😌
స్కోర్‌కార్డ్ ▶️ https://t.co/9rs6u5obOw#క్వాలిఫైయర్1 | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/1bhTGqwTok
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 26, 2026
సుదర్శన్ అన్ లక్కీ..
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగలింది. మూడు ఫోర్లు కొట్టి జోరు చూపించిన, ఆరెంజ్ క్యాప్ హోల్డర్, ఓపెనర్ సాయి సుదర్శన్ (14) ఆరంభంలోనే హిట్ వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో అసౌకర్యాంగా కదిలిన కెప్టెన్ శుభమాన్ గిల్ (2)ను భువనేశ్వర్ కుమార్ బౌల్డ్ చేశాడు. ఈ దశలో జోస్ బట్లర్ (11 బంతుల్లో 29, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఎదురుదాడికి దిగడంతో జీటీ స్కోరు బోర్డు కాస్త పరుగులెత్తింది. తను రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. అయితే కాసేపటికే తనను జోష్ హేజిల్ వుడ్ పెవిలియన్ కు పంపాడు. తర్వతి ఓవర్లోనే నిశాంత్ సింధు (5) కూడా ఔట్ కావటంతో జీటీ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఇక పవర్ ప్లేలో 51 పరుగులు సాధించడం, టార్గెట్‌కు చాలా దూరంగా జీటి ఇన్నింగ్స్ సాగింది.
𝗕𝗔𝗖𝗞-𝗧𝗢-𝗕𝗔𝗖𝗞 #𝗧𝗔𝗧𝗔𝗜𝗣𝗟 𝗙𝗜𝗡𝗔𝗟𝗦. ❤️🔥
ప్రతి కీర్తన. ప్రతి ఉత్సాహం. 12వ మ్యాన్ ఆర్మీ నుండి ప్రతి క్షణం మద్దతు మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. 🥹❤️
అహ్మదాబాద్‌లో చివరి డ్యాన్స్ వేచి ఉంది. ✊ pic.twitter.com/7fUmCfgwDv
— రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (@RCBTweets) మే 26, 2026
తెవాటియా పోరాటం..
ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లను జీటీ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ (8), జాసన్ హోల్డర్ డకౌట్ అవడంతో జీటీ కోలుకోలేక పోయింది. మరోవైపు వరుసగా వికెట్లు పడుతున్నా, తెవాటియా.. ఎదురు దాడికి దిగాడు. ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రెచ్చిపోయాడు. తొమ్మిదో వికెట్ కు మహ్మద్ సిరాజ్ (5) తో కలిసి 68 పరుగులు జోడించాడు. ఇందులో సింహభాగం పరుగులను తెవాటియనే సాధించాడు. ఈ క్రమంలో 33 బంతుల్లో అర్ధ సెంచరీని తెవాటియ పూర్తి చేసుకున్నాడు. కాసేపటికే తను ఔట్ కావడంతో జీటీ ఆట ముగిసింది. ఓవరాల్ గా డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగి, ఆర్సీబీ వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకు పోవడంపై ఆ జట్టు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం అవుతోంది. మిగతా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్, క్రునాల్ పాండ్యాకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఇది కూడా చదవండి: రజత్ పాటిదార్ స్క్రిప్ట్స్ చరిత్ర: పతిదార్ వరల్డ్ రికార్డ్: క్వాలిఫయర్ 1 లో ఆర్సీబీ కెప్టెన్ బీభత్సం.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయి
ఇంకా చదవండి

