IPL 2026 SRH VS RR రిజల్ట్ అప్డేట్లు: ఐపీఎల్ 2026 సీజన్ లో స’న్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఎన్నో ఆశలతో నాకౌట్లోకి అడుగుపెట్టిన ఆ జట్టు, తొలి మెట్టుపైనే బోల్తా పడింది. మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులతో ఘోర పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీనితో రాయల్స్, క్వాలిఫర్-2 కు అర్హత. అంతకుముందు ఎమినేటర్లో భాగంగా బుధవారం ముల్లన్ పూర్లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 243 పరుగులు చేసింది. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ సూపర్బ్ ఫిఫ్టీ (29 బంతుల్లో 97, 5 ఫోర్లు, 12 సిక్సర్లు) తో త్రుటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. బౌలర్లలో ప్రఫుల్ హింగేకు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం ఛేజింగ్ లో సన్ చతికిల పడింది. 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌటైంది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి (20 బంతుల్లో 38, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. బౌలర్లో జోఫ్రా ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈ విజయంతో క్వాలిఫర్-2కు అర్హత సాధించిన రాయల్స్.. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.
వికెట్ టేకింగ్ పార్టీ కొనసాగుతోంది 🔢
అంతే @రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి 🩷#SRH ఛేజింగ్‌లో 6 ఓవర్ల తర్వాత 71/4
నవీకరణలు ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #ఎలిమినేటర్ | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/h8124Eljsm
— ఇండియన్ప్రీమియర్లీగ్ (@IPL) మే 27, 2026
ఆర్చర్ షాక్..
భారీ టార్గెట్ తో బ రిలోకి దిగిన స న్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రమాదకర అభిషేక్ శర్మను ఆర్చర్ ఔట్ చేశాడు. ఈ దశలో ట్రావిస్ హెడ్ (17), ఇషాన్ కిషన్ (33) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. ముఖ్యంగా ఇషాన్ ధాటిగా ఆడటంతో స్కోరుబోర్డు పరుగులెత్తింది. మూడేసి ఫోర్లు, సిక్సర్ల చొప్పున తను బాదడంతో సన్‌కు మంచి ఆరంభమే లభించింది. అయితే డేంజరస్ గా మారుతున్న ఇషాన్ ను ఆర్చర్ పెవిలయిన్ కు పంపాడు. ఆర్చర్ బౌలింగ్ పుల్ షాట్ కు ప్రయత్నించి, ఇషాన్ ఔటయ్యాడు. అతని స్థానంలో వచ్చిన రవిచంద్రన్ స్మరణ్ (1) బంతులు వేస్ట్ చేసి, ఔటయ్యాడు. ఇక తర్వాత ఓవర్లోనే ట్రావిస్ హెడ్ కూడా ఔట్ కావటంతో సన్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈక్రమంలో పవర్ ప్లేలో 71 పరుగులు ఉన్నాయి.
నితీశ్, సలీల్ పోరాటం..
ఇక కాసేపటికే ఎన్నో ఆశలు పెట్టుకున్న హెన్రిచ్ క్లాసెన్ (18) కూడా ఔట్ కావడంతో 81 పరుగులకే సన్ సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సలీల్ తో కలిసి నితీశ్ చక్కని పోరాట పటిమ ప్రదర్శించాడు. ఎంతో ఒత్తిడి నెలకొన్న దశలో కూడా, చూడ చక్కని షాట్లు ఆడాడు. వీరిద్దరూ ఆరో వికెట్ కు చకచకా 56 పరుగులు జోడించడంతో ఒక దశలో ఆశలు చిగురించాయి. అయితే కీలకదశలో నితీశ్ ఔట్ కావడం, సలీల్ కు తోడు నిలిచే వారు ఎవరూ లేకపోవడంతో సన్‌కు ఓటమి తప్పలేదు. ఇక మే 29న క్వాలిఫయర్ 2లో గుజరాత్ తో రాయల్స్ తలపడనుంది. మిగతా బౌలర్లలో బర్గర్, సుశాంత్, జడేజాకు రెండేసి వికెట్లు దక్కాయి.
ఇది కూడా చదవండి: IPL 2026 RCB ఫైనల్లో: వరుసగా రెండో సీజన్లో ఫైనల్లోకి ఆర్సీబీ.. జీటీని చిత్తుగా ఓడించిన పతిదార్ సేన.. రాణించి డఫీ, భువీ, తెవాటియా పోరాటం వృథా
ఇంకా చదవండి

