ఇరుముడి రిలీజ్ డేట్ అప్డేట్: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో ప్రస్తుత కెరీర్ లో గడ్డు కాలాన్ని ఎదురుకుంటున్న టాప్ హీరోల్లో ఒకరు మాస్ మహారాజ రవితేజ. ఆయన గత చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈ సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఆయన ముందు సినిమాలతో ప్రస్తుతం టాక్ కాస్త బెటర్ గానే వచ్చినప్పటికీ , ఆడియన్స్ ఎందుకో రవితేజ ని నమ్మలేదు. ఇప్పుడు రీసెంట్ గా ఆయన ‘ఇరుముడి’ అంటే ఒప్పుకున్నాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. పైగా సుబ్రమణ్య స్వామి నేపథ్యం లో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు అనే క్లారిటీ ఇవ్వడంతో ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రం ఎప్పుడు విడుదలైనా రవితేజ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుంది , అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ పై మేకర్స్ ఒక క్లారిటీ కి వచ్చినట్టు కనిపిస్తుంది. ఆగస్టు నెలలో ఈ విడుదల చేయాలని చూస్తున్నారట. అది మొదటి వారంలో విడుదల చేయాలా?, లేదంటే ఆగస్టు 14న విడుదల చేయాలా అని ఆలోచిస్తున్నారట. ఆగస్టు 14న విడుదల చేస్తే, 15న స్వాతంత్ర దినోత్సవం కలిసి వస్తుంది , టాక్ తో సంబంధం లేకుండా బ్రేక్ ఈవెన్ మార్కుని అవలీలగా అందుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది , ఆగస్టు 24 న నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ విడుదల కాబోతుంది. ఈ చిత్రం పై ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకవేళ ఆగస్టు 14న విడుదల చేస్తే, కేవలం 10 రోజుల థియేట్రికల్ రన్ మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత ఈ సినిమా పాజిటివ్ టాక్ వచ్చి , మంచి రన్ కూడా థియేటర్స్ ని , ‘ది ప్యారడైజ్’ కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే కంటెంట్ మీద నమ్మకంతో ఆగస్టు మొదటి వారంలో ఈ బలమైన విడుదల చేస్తే , పాజిటివ్ టాక్ మీద 3 వారాల బలమైన థియేట్రికల్ రన్ ని చూడొచ్చు. కాబట్టి మేకర్స్ మొదటి వారం లోనే విడుదల చేస్తే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారట మేకర్స్.

