Israel Pakistan Tensions: ఇరాన్ , అమెరికా మధ్య ఇంతకాలం వరకు యుద్ధం సంభవించింది. ఇప్పుడు కాస్త పరిస్థితులు నెమ్మదిగా మారిపోయాయి.. దాడులు అడపాదడపా కొనసాగుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ మధ్యవర్తి పాత్ర పోషించింది. ఒకసారి ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు నిర్వహించారు. ఆ చర్చలు అర్థాంతరంగా ముగిసిపోయాయి.
రెండోసారి చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ తీవ్రంగా తప్పు పట్టింది. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుపై ఇజ్రాయిల్ తీవ్రంగా మండిపడింది.. పాకిస్తాన్ విశ్వసనీయమైన మధ్యవర్తి కాదని బాంబు పేల్చింది..
ఇరాన్‌కు పాకిస్థాన్ అనుకూలంగా ఉందని.. పాకిస్థాన్‌కు ఇలాంటి దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు తెలియవు. ప్రశాంత వాతావరణం నెలకొల్పే విషయంలో ఇరాన్, అమెరికా పాకిస్థాన్ దేశాన్ని సంప్రదిస్తే తమకు ఎటువంటి ఇబ్బంది లేదని.. అయితే యుద్ధం విషయంలో తమ అభిప్రాయాన్ని పాకిస్థాన్ మార్చలేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసింది..”ఉగ్రవాదం.
ఇజ్రాయిల్ ఇలా అనుమానించటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరాన్ దేశానికి సహకారం అందిస్తోంది. తమ దేశంలో స్థిరపడిన పాకిస్తాన్ పౌరులను బయటికి పంపుతోంది. అంతేకాదు స్పష్టమైన ఆధారాలతో పాకిస్థాన్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఇది ఇజ్రాయిల్ కు అనుమానాలు బలపడే విధంగా చేసింది. పాకిస్థాన్ దేశంతో ఇజ్రాయిల్ కు గొప్పగా చెప్పుకునే దౌత్య సంబంధాలు లేవు. అధికారికంగా ఇంతవరకు దౌత్య సంబంధాలు కొనసాగిన దాఖలాలు లేవు. గతంలో ఇజ్రాయిల్ పాలస్తీనాపై దాడులు చేసినప్పుడు పాకిస్థాన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. ఇజ్రాయిల్ పాకిస్తాన్ పాత్ర మీద విమర్శలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం కొత్త మలుపుతీసుకుంది..
మరోవైపు రూవెన్ అజర్ భారత్ పాత్రపై ప్రశంసలు కురిపించారు. పశ్చిమ ప్రాంతంలో స్థిరత్వం తీసుకురావడం భారత్ వల్ల మాత్రమే అవుతుందని అంచనా. అంతేకాదు భారతదేశంతో తాము వ్యూహాత్మకమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాము.. అది ఇప్పుడు మరింత బలపడుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా, పాకిస్థాన్, ఇజ్రాయిల్ మధ్య సంబంధాలు మొదటి నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి. 974లో పాకిస్తాన్.. 1948లో ఇజ్రాయిల్ ఏర్పడింది.. ఇజ్రాయిల్ దేశాన్ని పాకిస్తాన్ ఇంతవరకు అధికారికంగా గుర్తించలేదు. పైగా పాలసీనకు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తోంది.

