ఇస్రో శాస్త్రవేత్త రాజీనామాలు : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఐఎస్ఆర్వో) ఇటీవలి నెలల్లో తన అనుభవజ్ఞులైన సైంటిస్టులను కోల్పోతోంది. ఈ పరిణామం దేశంలోని అత్యంత ముఖ్యమైన అంతరిక్ష కార్యక్రమాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్‌లో ఉంది స్పేస్(డీవోఎస్) తక్షణ చర్యలు తీసుకుంటారు.
రాజీనామాలకు కారణాలు..
కొన్ని నెలలుగా ఐఎస్ఆర్వో నుంచి 100 నుంచి 120 మంది సైంటిస్టులు రాజీనామా చేశారు. ఇందులో అనుభవం, నైపుణ్యం ఉన్న వారు కూడా ఉన్నారు. వంద మందికిపైగా సైంటిస్టులు ఇస్త్రోను వీడడం మామూలు విషయం కాదు. సంస్థలో ప్రతీ సైంటిస్టు పని అనుభవం, జ్ఞానం అనేది సంస్థకు ఒక ఆస్తి. వంద మందికిపైగా వీడడం మిషన్ల నాణ్యత సంస్థ, టైమ్లైన్లపై నేరుగా ప్రభావం చూపుతుంది.
గగన్‌యాన్ వంటి మిషన్లపై దృష్టి
భారతదేశం మానవ సహిత అంతరిక్ష యాత్ర (గగన్‌యాన్)వంటి చరిత్రాత్మక మిషన్లను చేపట్టింది. ఇలాంటి ప్రాజెక్టులలో పనిచేసే సైంటిస్టులు రాజీనామా లేదా వాలంటరీ రిటైర్మెంట్లు కోరినప్పుడు, వాటిని వెంటనే ఆమోదించమని ఐస్రో కేంద్రాలకు డీవోఎస్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బదులుగా, అలాంటి అభ్యర్థనలను డీవోఎస్కు పంపి, అక్కడి నుంచి నిర్ణయం సూచించింది. ఇది సాధారణ ఆదేశం కాదు. కీలక మిషన్లలో పనిచేసే నిపుణులను త్వరగా కోల్పోకుండా రక్షించేందుకు జాగ్రత్త చర్య.
డీవోఎస్ జోక్యం..
డీవోఎస్ జోక్యం చేసుకోవడం రెండు విషయాలను స్పష్టం చేస్తోంది. ఇస్రోలోని అనుభవజ్ఞులైన సైంటిస్టులను నిలుపుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకుంది. రెండోది సంస్థలోని మానవ వనరుల నిర్వహణను కేంద్రీకృతం చేయాలనుకుంటున్నది. ప్రతి రాజీనామా అభ్యర్థనను వ్యక్తిగతంగా పరిశీలించి, సంస్థకు అవసరమైన నైపుణ్యాలను కాపాడుకోవాలన్నది ఈ సూచన ముఖ్య ఉద్దేశం. ఇదిలోని పని వాతావరణం, పరిహారం, కెరీర్ సంస్థ వంటి వాటికి కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
జ్ఞానం బదిలీ..
ఐస్రో వంటి సంస్థలో సైంటిస్టుల రాజీనామాలు కేవలం వ్యక్తిగత నిర్ణయాలు మాత్రమే కావు. అవి సంస్థలోని నిర్వహణ, ప్రోత్సాహకాలు, బాహ్య అవకాశాలు వంటి విస్తృత కారణాలను ప్రతిబింబిస్తాయి. అనుభవజ్ఞులైన వారు బయటకు వెళ్లడం వల్ల కొత్తగా వచ్చే వారికి ఆ జ్ఞానాన్ని బదిలీ చేయడం కష్టమవుతుంది. పని ఒత్తిడి తగ్గించడం, మెరుగైన పరిహారం, కెరీర్ వృద్ధి అవకాశాలు, ప్రైవేట్ రంగంతో పోటీపడే విధంగా విధానాలు రూపొందించడం ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఇస్రో భారతదేశ అంతరిక్ష లక్ష్యాలకు మూలస్తంభం. దాని విజయం సైంటిస్టుల ప్రతిభ, అంకితభావంపై ఆధారపడి ఉంది. డీవోఎస్ ఇచ్చిన ఆదేశాలు ఈ ప్రతిభను రక్షించడానికి తీసుకున్న ముందస్తు చర్యగా కనిపిస్తున్నాయి. అయితే, ఇది కేవలం దానితో మాత్రమే సాధ్యం కాదు. సంస్థలోని వాతావరణం, అవకాశాలను అందించడం ద్వారా దీర్ఘకాలికంగా ప్రతిభావంతులను నిలుపుకోవచ్చు.

