తెలంగాణ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సమావేశమయ్యారు. తుంగతుర్తి పై వివాదం మాట్లాడారు. అయితే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో వివాదం ముగిసిన అంశమని జగ్గారెడ్డి అన్నారు. రాజగోపాల్ రెడ్డితో రాష్ట్రాల రాజకీయాలపై చర్చించామని అన్నారు. ఉమ్మడి నల్లగొండలో రాజగోపాల్ రెడ్డి నాయకుడని ఆయన అన్నారు.
రాహుల్‌ని ప్రధాని చేయాలంటే తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలవాలన్న జగ్గారెడ్డి రాజగోపాల్ రెడ్డి టీమ్‌గా పనిచేస్తే పార్టీకి మేలు అని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. తుంగతుర్తి అంశం ప్రధాన ఎజెండా కాదని జగ్గారెడ్డి చెప్పారు. స్థానిక నాయకులే సమస్యను పరిష్కరించుకోవాలని జగ్గారెడ్డి సూచించారు. కాంగ్రెస్ లో వివాదాలు మామూలేనని, అవి సర్దుకుంటాయని చెప్పారు.

