యానిమల్ అంబులెన్స్: ముంబై నగరంలో గాయపడిన, అనారోగ్యంతో ఉన్న లేదా నిరాశ్రయ స్థితిలో ఉన్న చిన్న జంతువులకు అత్యవసర వైద్య సహాయం లేదు. “జీవ్వన్ లైఫ్‌లైన్” (JeevOne లైఫ్‌లైన్) పేరుతో రూపొందించిన ఈ వినూత్న సేవ ట్రాఫిక్ రద్దీని అధిగమిస్తూ జంతువులను వేగంగా వెటర్నరీ ఆస్పత్రులకు తరలించడానికి ఉపయోగపడుతుంది.
జీవ్వన్ అనే జంతు సంక్షేమ సంస్థ, యువసేన యానిమల్ వెల్ఫేర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ అంబులెన్స్ సేవను బుధవారం ప్రారంభించింది. గాయపడిన, లేదా అనారోగ్యంతో బాధపడుతున్న, ఇంకా వదిలివేయబడిన లేదా ప్రమాదంలో ఉన్న జంతువులకు సకాలంలో తక్కువ ఖర్చుతో రవాణా సదుపాయం కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. జీవ్వన్ వ్యవస్థాపకుడు, జంతు సంక్షేమ కార్యకర్త సంకేత్ భట్ మాట్లాడుతూ.. దేశంలో జంతు రక్షణ చర్యలు పెరుగుతున్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఫీడర్లు, రెస్క్యూ బృందాలు, స్వచ్ఛంద సంస్థలు, జంట ప్రేమికులు ఈ సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నారని తెలిపారు.
దాదాపు ఆరు పాటు ప్రణాళికలు రూపొందించిన తరువాత “జీవ్వన్ లైఫ్‌లైన్” అభివృద్ధిని ఆయన నెలకొల్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం విలువైనదే కావడంతో జంతువులకు వేగంగా సహాయం అందించిన ఈ సేవ లక్ష్యమని చెప్పారు. మొదటి EV బైక్ అంబులెన్స్‌ను థానేలో యువసేన అధ్యక్షుడు పూర్వేష్ సర్ణాయాక్ అధికారికంగా ఉపయోగిస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ముంబైలోని వివిధ ప్రాంతాలలో సుమారు 10 EV బైక్ అంబులెన్స్‌లను ప్రవేశపెట్టనుంది.
ఈ ప్రయోగాత్మక దశలోని నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించి, స్పందన వ్యవస్థను మరింత మెరుగుపరచాలని నిర్వాహకులు ఉన్నారు. భవిష్యత్తులో అంతటా.. అనంతరం దేశంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ మోడల్‌ను విస్తరించే ప్రణాళికలు ఉన్నాయి. నగరాల్లో జంతు రక్షణ చర్యలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ బైక్ అంబులెన్స్ సేవ ద్వారా అత్యవసరంగా వేగవంతమైన స్పందన, తక్కువ ఖర్చుతో రవాణా, వెటర్నరీ సేవలకు సులభమైన ప్రాప్యత, సాంకేతిక ఆధారిత ట్రాకింగ్ వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, జంతు సంక్షేమ కార్యకర్తలకు మెరుగైన సహకారం లభించింది.
“సమస్యల గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా వాటికి పరిష్కారాలను కనుగొనాలని నేను నిర్ణయించుకున్నాను. అత్యవసర జంతు సంరక్షణలో రవాణా చేయడం ఒక ప్రధాన సవాలు. జంతువు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు సత్వర సహాయం అందించాలనే ఉద్దేశ్యంతోనే జీవన్ లైఫ్‌లైన్‌ను ప్రారంభించాను” అని సంకేత్ భట్ తెలిపారు. భవిష్యత్తులో జంతు అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి మరిన్ని సంస్థలు, CSR సంస్థలు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు. వారి సహకారంతో అందరికీ జంతు అంబులెన్స్‌ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
🚑🐾 అంబులెన్స్ కంటే ఎక్కువ. జంతు సంక్షేమం కోసం కొలవగల పరిష్కారం. ఈ వీడియోలో, జంతువుల కోసం భారతదేశపు మొట్టమొదటి EV బైక్ అంబులెన్స్ సర్వీస్ అయిన JeevOne లైఫ్‌లైన్ వెనుక ఉన్న ఫీచర్లు, డిజైన్ మరియు విజన్ గురించి మేము మీకు తెలియజేస్తాము. రద్దీగా ఉండే నగర రోడ్లను నావిగేట్ చేయడానికి, ప్రతిస్పందనను తగ్గించడానికి నిర్మించబడింది pic.twitter.com/aIpybETcmx
— సంకేత్ భట్ (@imsank) జూన్ 24, 2026

