Karuppu 12 Days Collections: తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ బాక్స్ ఆఫీస్ వద్ద వస్తున్న వసూళ్లను చూస్తుంటే , ఈ రేంజ్ బ్యాక్ ఈమధ్య కాలంలో ఏ సౌత్ స్టార్ హీరో కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. అప్పట్లో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రంతో ఏ రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడో , సూర్య ఇప్పుడు దాదాపుగా అదే రేంజ్ కం బ్యాక్ ఇచ్చాడు. వంద కోట్ల గ్రాస్ వసూళ్లను కూడా కొల్లగొట్టలేని స్థాయి నుండి , ఇప్పుడు ఏకంగా 300 కోట్ల గ్రాస్ ని కొల్లూగొట్టే స్థాయికి చేరుకోబోతున్నాడు. విడుదలై దిగ్విజయంగా 12 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ప్రాంతాల వారిగా ఎంత గ్రాస్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి ఈ కథనంలో చూద్దాం. తెలుగు లోనే ఈ చిత్రం మొదటి వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంది.
తమిళనాడు రాష్ట్రము నుండి ఈ చిత్రం దాదాపు 12 రోజుల్లో 124 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం తమిళనాడు రాష్ట్రం నుండి 150 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునేలా అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక్క చెన్నై సిటీ నుండే ఈ చిత్రం 18 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే , ఈ చిత్రం ఇక్కడ ‘వీరభధ్రుడు’ అనే టైటిల్ తో విడుదలైన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ని కేవలం 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ 12 రోజుల్లో ఇప్పటి వరకు ఈ వెర్షన్ తెలుగు వెర్షన్ నుండి 27 కోట్ల గ్రాస్ వసూళ్లు, 14 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు వచ్చాయి.
అంటే పెట్టిన డబ్బులకు రెండింతలు లాభాలు వచ్చాయి అన్నమాట. ఇది సాధారణమైన విషయం కాదు. అదే విధంగా కర్ణాటక రాష్ట్రం నుండి ఈ చిత్రం 19 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా , కేరళ నుండి 11 కోట్ల 75 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 3 కోట్లు, ఓవర్సీస్ నుండి 68 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ తమిళ చిత్రాల ప్రపంచవ్యాప్తంగా తెలుగు , భాషలకు కలిపి ఇప్పటి వరకు 253 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ వీకెండ్ కూడా బలమైన హోల్డ్ ని కనబర్చగలిగితే ఈ చిత్రం కచ్చితంగా 300 కోట్ల గ్రాస్ మార్కును సాధిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

