కావ్య మారన్ తండ్రి మరియు ఇషాన్ కిషన్ వాదన: ప్లే ఆఫ్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టుతో హైదరాబాద్ తలపడుతున్నప్పుడు.. 240 పరుగులను ఛేదించాల్సి వచ్చినప్పుడు.. అభిషేక్ శర్మ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ సమయంలో హైదరాబాద్ అభిమానులకు పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే క్రీజులో ఇషాన్ కిషన్ ఉన్నాడు కాబట్టి చాలామందికి జట్టు గెలుస్తుందని నమ్మకం ఉంది. పైగా కిషన్ కూడా జోప్రా ఆర్చర్ బౌలింగ్ లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత ఒక ఫోర్ కూడా కొట్టాడు. ఆ తదుపరి బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు.
కిషన్ అలా అవుట్ కావడంతో మైదానంలో ఉన్న అభిమానులు మొత్తం ఆవేదనకు గురయ్యారు. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ అయితే దాదాపు ఏడ్చినంత పనిచేసింది. ఎందుకంటే కిషన్ అవుట్ మ్యాచ్. స్వరూపం పూర్తిగా మారిపోయింది అప్పటిదాకా రాజస్థాన్ జట్టుకు మించి స్కోర్ చేసిన హైదరాబాద్.. ఆ తర్వాత ఒత్తిడిలో కూరుకుపోవడం మొదలైంది. కిషన్ అవుట్ అయిన తర్వాత హెడ్ కూడా పెవిలియన్ దారిపట్టాడు. క్లాసెన్ కూడా అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది.
హైదరాబాద్ జట్టు ఓటమి పాలు కావడానికి అభిమానులు మాత్రమే కాదు.. జట్టు ఓనర్ కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ కూడా జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోకి వచ్చాడు. ఇషాన్ కిషన్ తో మ్యాచ్ గురించి చర్చించాడు..
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కిషన్ ఆట తీరు పట్ల కళానిధి మారన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ జట్టు గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోయిందని కళానిధి మారన్ ఆవేదన వ్యక్తం చేసినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే ఒప్పందం ఇంతవరకు అధికారికంగా కిషన్ స్పందించలేదు. సన్‌రైజర్స్ యాజమాన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇది ఏదైనా దుష్ప్రచారమా.. మరొకటా అనేది తేలాల్సి ఉంది. ఏఐ ఫోటోలు కూడా ఇటువంటి ప్రచారం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అలాంటప్పుడు అధికారిక అధికారులు మాత్రమే నమ్మాలని చెబుతున్నారు.
ఈ విషయం బీసీసీఐకి తెలిసినట్టు సమాచారం. దీంతో సన్‌రైజర్స్ యాజమాన్యానికి జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాదు కిషన్ ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని. అయితే కొన్ని రోజుల్లో పూర్తి వివరాలు మరికొద్ది తెలుస్తాయి.
SRH ఎలిమినేటర్‌లో RR చేతిలో ఓడిపోయిన తర్వాత ఇషాన్ కిషన్ మరియు కావ్య మారన్ తండ్రి మధ్య తీవ్రమైన వాదన.
మూలాల ప్రకారం, కావ్య మారన్ జోఫ్రా ఆర్చర్‌పై 6, 6, 4 కొట్టిన తర్వాత ఇషాన్‌తో సంతోషంగా లేరు. అతను మ్యాచ్‌ని పూర్తి చేయాలని ఆమె కోరుకుంది, కానీ అతను చేయలేడు.
అక్కడ ఉంది… pic.twitter.com/Wgm3CFeDvM
— అభిషేక్ కుమార్ (@Abhishek060722) మే 28, 2026

