బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ చెప్పే మాటలు ఆచరణలో పెట్టారు. ఇదిగో వస్తున్నా అనే లోగా రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగి వస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పరిశీలన గత రెండు రోజుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి ఇచ్చారు. పాలమూరు నీటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యంగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో అన్యాయం జరిగింది కేసీఆర్ మూడు నాలుగు నెలల క్రితం సమావేశం పెట్టారు. త్వరలో మూడు జిల్లాల్లో సభలను పెడుతున్నానంటూ చెప్పారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండిపోగా, రేవంత్ రెడ్డి మాత్రం పాలమూరు జిల్లాలో గడపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
కొన్నాళ్ల క్రితం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై మూడు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించారు. ఇది ప్రకటించి నెలలు గడిచింది. తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆ జిల్లాల నేతలతో సమావేశమై సభల ఏర్పాటుపై చర్చించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో జరిగే సభలకు తానే స్వయంగా హాజరవుతానని ప్రకటించారు. అసలు దానిని అటకెక్కించారు. అంతకు ముందు వరంగల్ లో జరిగిన ఆవిర్భావ సభలో జనంలో ఉంటానని ప్రజా సమస్యలపై పోరాడతానని, ప్రభుత్వం మెడలు వంచుతానని కేసీఆర్ ప్రకటించారు. కానీ ఏడాది దాటినా ఆ ఊసే లేదు.
కేసీఆర్ చెప్పేవన్నీ ఉత్తుత్తి మాటలనేది కేవలం ఆ పార్టీ నేతలకే కాకుండా ప్రజలకు కూడా అర్థమైంది. అసలు తనకు వీలు కానప్పుడు ఎందుకు చెప్పాలి? చెప్పిన సమయానికి ఎందుకు రారు? ఇలా చేస్తే రాజకీయంగా పార్టీ ఎలా నియోజకవర్గాల్లో బతికి బట్టకడుతుందన్న భయం గులాబీ పార్టీ నేతల్లోనూ, క్యాడర్లోనూ అణువణువునా ఉంది. కేటీఆర్, హరీశ్ రావు తిరుగుతున్నప్పటికీ చెప్పిన మాట మీద నిలబడలేని కేసీఆర్ ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తారన్నది సమాధానం దొరకని ప్రశ్నగానే మిగిలిపోయింది. రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే ఒక అడుగు ముందే ఉండి సవాళ్లు విసరుతతో బీఆర్ఎస్ నేతలకు నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్లయినా ఇప్పటికీ జనంలోకి రానంటే ఎలా? అని క్యాడర్ ప్రశ్నిస్తుంది.

