విజయవాడ : మాజీ మంత్రి కొడాలి నానిపై మరోకేసు నమోదైంది. విజయవాడలో టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. కొడాలి నాని ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఉపా చట్టాన్ని ఉప్మా చట్టంగా మాట్లాడటాన్ని తప్పుపడుతూ టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
ఉప చట్టాన్ని…
ఉపా చట్టాన్ని వ్యంగ్యంగా మాట్లాడటాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. యూ ట్యూబర్ రావణ్ పై ఉపా చట్టం పెట్టడంతో దానిపై మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు చట్టానికి విరుద్ధంగా ఉన్నాయని అంటున్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యల పరిశీలన కూడా టీడీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

